రూ. 40 కోట్ల డ్రగ్స్తో దొరికిన సినిమా హీరో: సింగపూర్ నుంచి వస్తూ చెన్నైలో దొరికిపోయాడు..!

రూ. 40 కోట్ల డ్రగ్స్తో దొరికిన సినిమా హీరో: సింగపూర్ నుంచి వస్తూ చెన్నైలో దొరికిపోయాడు..!

కోటి కాదు.. రెండు కోట్లు కాదు.. ఏకంగా 40 కోట్ల విలువైన డ్రగ్స్తో బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ ఎయిర్ పోర్ట్ లో దొరికిపోయాడు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఈ ఘటన జరిగింది. 2019లో విడుదలైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాలో నటించిన విశాల్ బ్రహ్మ సింగపూర్ నుంచి చెన్నైకి విమానంలో వచ్చాడు. ఫ్లైట్ AI 347లో వచ్చిన అతనిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీ చేయగా కోట్ల విలువైన డ్రగ్స్ అతని దగ్గర దొరికాయి. నైజీరియన్ గ్యాంగ్ తో ఇతనికి సంబంధాలున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇతని విలాసాలకు డబ్బు అవసరమైన ప్రతీసారి.. నైజీరియా వెళ్లి ఇండియాకు తిరిగి వస్తూ డ్రగ్స్ తీసుకొచ్చేవాడు.

విమానాశ్రయ అధికారులను బురిడీ కొట్టించి ఇన్నాళ్లూ దందా నడిపించిన విశాల్ బ్రహ్మ ఎట్టకేలకు దొరికిపోయాడు. హాలిడేస్ గడిపి రావడానికి అని ప్రతీసారి వెళ్లినట్టే ఈసారి కూడా కాంబోడియా వెళ్లాడు. ఇండియాకు తిరిగి వస్తూ చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ తో దిగాడు. విమానాశ్రయ అధికారులకు అనుమానం రావడంతో 40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలతో అడ్డంగా దొరికిపోయాడు. అతనిపై నార్కోటిక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతనికి నైజీరియా డ్రగ్స్ ముఠాలతో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

టాలీవుడ్, కోలీవుడ్లో డ్రగ్స్ దందా గురించి ఇప్పటికే బయటపడిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో డ్రగ్స్ దందాలో బాలీవుడ్ కూడా తక్కువేం కాదని విశాల్ బ్రహ్మ ఎపిసోడ్ నిరూపించింది. ఇక్కడ ఉన్న డ్రగ్స్ సప్లయర్లకు విశాల్ బ్రహ్మ ఒక మధ్యవర్తిలా పనిచేస్తున్నాడు. డ్రగ్స్ తీసుకొచ్చి సప్లయర్లకు చేర్చడమే ఇతని పని. అక్కడ నుంచి ఇండియాలో ఉంటున్న నైజీరియన్ గ్యాంగ్స్ డ్రగ్స్ విక్రయాలు సాగిస్తుంటాయని విచారణలో వెల్లడైంది. బాలీవుడ్లో పలువురు ప్రముఖులు ఈ డ్రగ్స్ కస్టమర్లలో ఉన్నట్లు తేలింది.