Tabu: ఫెమినా@టబు..వ‌య‌సు మాత్ర‌మే 50..కానీ, నేను 30!

Tabu: ఫెమినా@టబు..వ‌య‌సు మాత్ర‌మే 50..కానీ, నేను 30!

సీనియ‌ర్ న‌టి ట‌బు (Tabu) సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సత్తా చాటుతోంది. అల వైకుంఠపురం మూవీలో టాలీవుడ్ కు వచ్చినా..తెలుగులో కంటున్యూ కాలేదు బాలీవుడ్ లో మాత్రం సత్తా చాటుతోంది. వ‌రుసగా హిందీ సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది.ఇటీవ‌లే 'ది క్రూ'తో మ‌రో భారీ విజ‌యం అందుకుంది. ఆ సినిమా 150 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించ‌డంతో లేటు వ‌యసులోనూ ఘాటు వ‌సూళ్లు అనే కితాబు సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం హిందీ లో మరికొన్నిప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అయింది.

ఇటీవ‌లే హాలీవుడ్ కి కూడా ప్ర‌మోట్ అయింది.ప్రపంచవ్యాప్తంగా అశేష ఫాలోయింగ్ ఉన్న డ్యూన్ సిరీస్ లో అవ‌కాశం అందుకుంది. 50 ఏళ్లు దాటినా అదే అందంతో హీటెక్కిస్తుంది.డిజైన‌ర్ దుస్తుల్లో త‌న‌దైన శైలి ఎలివేష‌న్ల‌తో ఆక‌ట్టుకుంటుంది.

తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ పిక్ ని షేర్ చేసింది.ఇందులో షోల్డ‌ర్ లెస్ బ్లాక్ క‌ల‌ర్ గౌనులో గతంకంటే మ‌రింత యంగ్ లుక్ లో ఆక‌ర్షిస్తుంది.వ‌య‌సు మాత్ర‌మే 50...కానీ నేను 30 అంటూ అల‌రిస్తుంది.ఈ పిక్ ని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ట‌బు ను చూసి అభిమానులు వావ్ అంటూ పొగిడేస్తున్నారు.అన్నట్టు ఫెమినా మ్యాగజైన్ జులై నెల కవర్ పేజీలోనూ బ్లక్ డ్రెస్ లో మెరిసిపోతోంది టబు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Femina (@feminaindia)