
అందం, టాలెంట్, వినోదంతో ప్రేక్షకులను అలరిస్తూ, తానేంటో నిరూపించుకుంటోంది అషురెడ్డి(Ashu Reddy).జూనియర్ సమంత అనే ట్యాగ్ లైన్ తో షార్ట్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన అషురెడ్డి రియాలిటీ షోలు,బిగ్ బాస్ వంటి కార్యక్రమాలలో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది.ఆమె ఎలా కనిపించినా అందనికే అందం అనేలా క్రేజ్ అందుకుంది.
ఆషురెడ్డి తన కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉండేది..ఇప్పుడు స్లిమ్ లుక్ లోకి మారి స్టార్ హీరోయిన్స్ కి సైతం పోటీ ఇవ్వగల రేంజ్ లో ఉంది. ఆమె గ్లామర్ షో సోషల్ మీడియా వేదికలపై హాట్ టాపిక్ అవుతోంది. ఆ మధ్య ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెకు కొత్త ఇమేజ్ తీసుకొచ్చింది.అనంతరం సోషల్ మీడియాలో ఆమె బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఆషురెడ్డి, రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తూ ట్రెండింగ్ లిస్టులో కొనసాగుతూ ఉంటుంది.
ఇటీవల ఆమె ఇటీవల గోల్డెన్ కలర్ లాంగ్ డ్రెస్ లో తీసుకున్న ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ,ఫ్యాన్స్ నుండి మత్తెక్కిపోయే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఆ లుక్స్,తనదైన ఫోజు ఒకటేమిటి..ఇక చాలా ఉన్నాయంటూ కుర్రాళ్ల గుండెల్ని కుదిపేస్తోంది.అయితే,ఆషురెడ్డి కేవలం సోషల్ మీడియా స్టార్ మాత్రమే కాదు, నటిగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంది.
"చల్ మోహన రంగా" చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆషురెడ్డి, "బాయ్ ఫ్రైండ్ ఫర్ హైర్"అనే చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది.ప్రస్తుతం "ఏ మాస్టర్ పీస్" అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. సోషియో ఫాంటసీ, మైథలాజికల్ అంశాలకు సైన్స్ ని ముడిపెడుతూ ఈ సినిమాని రూపొందించినట్టు టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. అదేవిధంగా మరికొన్ని సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఆమె ప్రయాణం, వెండితెర వరకు కొనసాగుతూ, ప్రేక్షకులకు తన ప్రత్యేకతను చాటుకుంది.