శ్రీవారి సన్నిధిలో దీపికా పదుకొణె

శ్రీవారి సన్నిధిలో దీపికా పదుకొణె
  • తండ్రి, సోదరితో కలసి తిరుమలకు వచ్చిన దీపిక
  • శ్రీవారి సన్నిధిలో తండ్రి ప్రకాష్ పదుకొణె (67) వ పుట్టిన రోజు 

తిరుపతి: బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన తండ్రి, బ్యాడ్మింటన్ మాజీ ఛాంపియన్ ప్రకాష్ పదుకొణెతో కలసి ఆమె తిరుమలకు వచ్చారు. శుక్రవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఇవాళ తన తండ్రి ప్రకాష్ పదుకొణె 67వ పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
దీపిక వెంట తండ్రి ప్రకాష్ పదుకొణెతోపాటు సోదరి అనీష పదుకొణె కూడా తిరుమల వచ్చారు. తన మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్త రణవీర్ సింగ్ తో లకసి తిరుమలకు వచ్చి దర్శించుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే కేన్స్ ఫెస్టివల్ లో దీపిక పెద్ద సందడి చేసిన దీపికా పదుకొణె ఇవాళ తిరుమలకు తండ్రి, సోదరితో కలసి వచ్చారు. తిరుమలకు వచ్చిన దీపికా పదుకొణెకు ఆలయ అధికారులు స్వాగతం పలుకగా దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీవారి ఆశీర్వచనాలు, తీర్ధ ప్రసాదాలు అందజేశారు.