
మహేశ్ బాబు కుమార్తె సితార టాలీవుడ్లో లిటిల్ ప్రిన్సెస్‌గా మారిపోయింది. చిన్నతనం నుంచే ఎంతో యాక్టివ్‌గా ఉండే సీతాపాప సెలబ్రెటీల ఫేవరెట్ కూడా. ఈ క్రమంలోనే సితారపై ఉన్న ప్రేమను చాటుతూ ఆమెకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది ఆలియా భట్. ఈ బాలీవుడ్ బ్యూటీకి సితార వీరాభిమాని. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్.
దీంతో ఆమెకు తన సొంత బ్రాండ్ నుంచి ఓ డ్రెస్‌ను డిజైన్ చేసి పంపింది. మీ కుటుంబంలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ దీన్ని అందుకున్న సితార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గతంలోనూ ఆలియా ఈ చిన్నారి కోసం ఇలాగే బట్టలు పంపింది. గతేడాది రణ్‌బీర్‌ను పెళ్లాడిన ఆలియా ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.