Amitab Bachchan: నాగ్ అశ్విన్ ఆలోచనాశక్తి అద్భుతం.. కల్కి సినిమాపై బిగ్ బి ప్రశంసలు

Amitab Bachchan: నాగ్ అశ్విన్ ఆలోచనాశక్తి అద్భుతం.. కల్కి సినిమాపై బిగ్ బి ప్రశంసలు

మహానటి(Mahanati) ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ కూడా కీ రోల్స్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. 

అయితే.. తాజాగా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్. ఆయన ఈ సినిమాలో అశ్వద్దామగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఓ ఈవెంట్ లో పాల్గొనగా కల్కి గురించి మాట్లాడుతూ సినిమాని ఆకాశానికెత్తేశాడు. దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ఆలోచనాశక్తి ఆద్భుతం. ఆయన ఆలోచనలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. షూటింగ్‌ సమయంలోనే ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుందనే భావన కలిగింది.

సినిమాలో కొన్ని సీన్స్‌ అద్భుతంగా అనిపిస్తాయి. ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయి. రిలీజ్ తరువాత ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎంతగానో ప్రశంసిస్తారు. ఇక బుజ్జి పాత్ర ఒక అద్భుతమని.. చెప్పుకొచ్చాడు అమితాబ్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.