దేవుడి మీద ఒట్టు.. ఏం జరిగినా ఎదుర్కొంటా

దేవుడి మీద ఒట్టు.. ఏం జరిగినా ఎదుర్కొంటా
  • బెదిరింపుల వేళ బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్ కామెంట్స్  

ముంబై:  లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుసగా బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఏం జరిగినా సరే బిగ్ బాస్ షోకు వస్తానని తెలిపారు. భారీ భద్రత నడుమ ఆయన ఇటీవల బిగ్ బాస్ షూట్ లో పాల్గొనగా, ఆ ఎపిసోడ్‌‌‌‌ తాజాగా ప్రసారమైంది. “దేవుని మీద ఒట్టు. నా జీవితంలో ఏం జరిగిన సరే ఇక్కడికి వచ్చి షోను హోస్ట్ చేయాలి. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాలి”అని ఈ సందర్భంగా బిష్ణోయ్ గ్యాంగ్ ను ఉద్దేశించి సల్మాన్ పరోక్షంగా చెప్పారు.