
మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పనుల్లో చేసిన బ్లాస్టింగ్ తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సిద్దిపేట జిల్లా తోర్నాల దగ్గర కాలువ పనుల కోసం బ్లాస్టింగ్ చేశారు. పేలుడు ధాటికి సురేశ్ అనే యువకుడికి రాయి తగలడంతో..అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన సురేశ్ ది నిజాంపేట మండలం చల్మెడగా గుర్తించారు. అధికారుల నిర్లక్ష్యంపై తోర్నాల గ్రామస్థులు మండిపడుతున్నారు. సురేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.