మధ్యాహ్నం పేల్చేస్తామంటూ ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు.. ఖాళీ చేసి వెళ్లిపోయిన జడ్జీలు, లాయర్లు

మధ్యాహ్నం పేల్చేస్తామంటూ ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు.. ఖాళీ చేసి వెళ్లిపోయిన జడ్జీలు, లాయర్లు

హైకోర్టులో మూడు LED బాంబులను పెట్టాం.. శుక్రవారం (సెప్టెంబర్ 12) మధ్యాహ్నం ప్రార్ధనలు ముగిశాక పేల్చేస్తాం.. అంటూ ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో కోర్టు ఆవరణను ఖాళీ చేశారు. జడ్జీలు, లాయర్లు, పిటీషనర్లు మొదలైన అందరూ కోర్టును వెంటనే వెళ్లిపోయారు. దీంతో కోర్టు చుట్టూ హై సెక్యూరిటీ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తు్న్నారు పోలీసులు. 

మెసేజ్ కనిమొజి తెవిదియా అనే మెయిల్ నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు ఉద్దేశ పూర్వకంగానే మెసేజ్ పంపినట్లు చెబుతున్నారు. మధ్యాహ్నం ఇస్లామిక్ ప్రేయర్ పూర్తైన తర్వాత.. 2 గంటలకు పేల్చుతామని ప్రకటించారు. 

మెసేజ్ పంపిన వ్యక్తి కోయంబత్తూర్ లో ఉన్న పాకిస్తాన్ ISI సెల్స్ ప్రతినిధిగా ప్రకటించుకున్నారు. 1998 బ్లాస్టుల తరహా పేలుళ్లు జరపనున్నట్లు హెచ్చరించారు. జడ్జి చాంబర్ లో పేలుడు పదార్థాలు పెట్టినట్లు ఈమెయిల్ లో పేర్కొన్నారు.

రాజకీయ వారసులే లక్ష్యంగా పేలుళ్లు జరపనున్నట్లు దుండగులు ప్రకటించారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కుమాడిపై యాసిడ్ దాడి చేయనున్నట్లు తెలిపారు. దేశంలో రాజకీయ నాయకత్వాన్ని మార్చేందుకే ఈ దాడికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. సూడో సెక్కులరిస్టులు, వారి అవినీతిని టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతామని మెసేజ్ పంపారు. 

సెక్యులర్ పార్టీలు వారసులపై ఆధారపడ్డాయని.. అవినీతితో బీజేపీ-ఆర్ఎస్ఎస్ తో ఫైట్ చేస్తున్నాయని. ఈ రాజకీయాలు మార్చేందుకే దాడికి ప్లాన్ చేసినట్లు మెయిల్ లో పేర్కొన్నారు దుండగులు. రాహుల్ గాంధీ, ఉదయనిధి స్టాలిన్ వంటి వారసులను అధికారానికి దూరం చేస్తే.. ఆర్ఎస్ఎస్ పై ఫైట్ చేసే ఆసక్తి వారిలో తగ్గుతుందని పేర్కొన్నారు. 

దీంతో కొత్త రకమైన సెక్యులర్ లీడర్ పుట్టుకొస్తాడని.. సూడో సెక్యులరిస్టులు తప్పుకుని అసలైన సెక్యులరిస్టులు పార్టీలో చేరుతారని తెలిపారు. అంతే కాకుండా డీఎంకే పార్టీని డా.ఎజిలన్ నాగనాథన్ టేక్ ఓవర్ చేసుకోవాలని సూచించారు.