ఢిల్లీ... శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు

ఢిల్లీ...  శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు

గురువారం అర్దరాత్రి  ( మే 30) ( తెల్లవారితే 31, శుక్రవారం)    శ్రీనగర్ విమానాశ్రయంలో    ఎయిర్ ఇండియా విస్తారా  విమానాన్ని తనిఖీ చేశారు. లగేజీతో పాటు ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేశారు. మే 30 అర్దరాత్రి 12 .10   గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది.  విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది.

విస్తారా విమానంలో బాంబు ఉందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి కాల్‌ చేశాడు. దాంతో ఎయిర్‌పోర్టులో తీవ్ర గందరగోళం నెలకొంది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లాల్సిన విస్తారా విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్‌పోర్టు కాల్ సెంటర్‌కు   ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. 177 మంది  ప్రయాణికులను శ్రీనగర్  విమానాశ్రయంలో దించేశారు . విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసినట్టుగా ఎయిర్‌లైన్ వర్గాలు తెలిపాయి. విమానం (UK-611 ) న్యూ ఢిల్లీ నుండి బయలు దేరి  శ్రీనగర్ చేరుకుంది.  గురువారం అర్దరాత్రి 12.10 గంటలకు ( అంటే శుక్రవారం ప్రారంభ సమయంలో ) శ్రీనగర్ విమానాశ్రయంలో తనిఖీలు చేశారు.  ఈ ఘటనను విస్తారా ధృవీకరించింది. 

శుక్రవారం ఉదయం విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేలో విమానాన్ని తనిఖీ చేశారు. లగేజీతో పాటు ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేశారు.  విమానాశ్రయంలో బూటకపు కాల్ చేసినందుకు కాల్ చేసిన వ్యక్తిపై  పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  విమానాన్ని   బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లతో తనిఖీ చేశారు.   విమానంలో ఎటువంటి పేలుడు పదార్థాలు కనుగొనబడలేదు. శ్రీనగర్ విమానాశ్రయంలో రెండు గంటలకు పైగా విమాన ఆపరేషన్ నిలిపివేయబడింది. ఇప్పుడు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.