వరుస బాంబు బెదిరింపుల కలకలం.. అంతా ఉత్తదేనని తేల్చిన పోలీసులు

వరుస బాంబు బెదిరింపుల కలకలం.. అంతా ఉత్తదేనని తేల్చిన పోలీసులు
  • రాజ్​భవన్​తో పాటు సిటీ సివిల్​ కోర్టు, జింఖాన్​ క్లబ్​కు బెదిరింపు మెయిల్​
  • అంతా ఉత్తదేనని తేల్చిన పోలీసులు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో మంగళవారం వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. రాజ్ భవన్​తో పాటు సిటీ సివిల్ కోర్టు, జడ్జి చాంబర్స్, సికింద్రాబాద్​ జింఖానా క్లబ్ లో నాలుగు ఆర్​డీఎక్స్​ బాంబులు పెట్టినట్లు జింఖాన్​ ఆఫీస్​ మెయిల్​అడ్రస్​కు, సిటీ సివిల్​కోర్టు ప్రధాన న్యాయమూర్తి మెయిల్​కు బెదిరింపు మెసేజ్​ వచ్చింది. దీంతో కోర్టులో అడ్వకేట్లు, సిబ్బంది, రాజ్​భవన్​సిబ్బంది ఆందోళన చెందారు. మధ్యాహ్నం 12 గంటలకు సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టిన‌‌‌‌ట్లు కోర్టు కు  మెయిల్​ పంపారు. దీంతో పోలీసులు అడ్వకేట్లు, సిబ్బందిని బయటకు పంపి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌‌‌‌ తో తనిఖీలు చేశారు. 

ఎక్కడా బాంబులు లేవని గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు రాజ్‌‌‌‌భవన్‌‌‌‌కు కూడా బాంబు బెదిరింపు మెయిల్​వచ్చింది. పోలీసులు హుటాహుటిన తనిఖీలు చేసి ఎక్కడా బాంబు దొరకలేదని చెప్పారు. కోర్టుకు వచ్చిన మెయిల్​లో తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ విద్యార్థులు అని ఉంది. ఆ యూనివర్సిటీలో జరుగుతున్న వ్యవహారాలను అక్కడి పోలీసులు పట్టించుకోవడం లేదని, అందుకే ఇలా చేశామని మెయిల్​లో మెన్షన్​చేశారు. మెయిల్​వచ్చిన 23 నిమిషాల్లో జింఖానా క్లబ్​లో బాంబు పేలబోతోందనే బెదిరింపు కూడా ఉంది. దీంతో హైరానా పడిన పోలీసులు తనిఖీలు చేయగా, ఉత్త బెదిరింపే అని తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.