శ్రీహరికోట షార్‎ కేంద్రానికి బాంబు బెదిరింపు.. అణువణువు గాలిస్తోన్న CISF

శ్రీహరికోట షార్‎ కేంద్రానికి బాంబు బెదిరింపు.. అణువణువు గాలిస్తోన్న CISF

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)కు బాంబ్ బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. షార్‎లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగుడు చెన్నైలోని సీఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ బలగాలు శ్రీహరికోటలో తనిఖీలు చేపట్టాయి. షార్ కేంద్రంలో బలగాలు అణువణువునా గాలించాయి.

ఎలాంటి బాంబ్, అనుమానస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో ఫేక్ కాల్‎గా నిర్ధారించారు అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేక్ కాల్ చేసిన వ్యక్తి ఎవరనేది దానిపై ఆరా తీస్తున్నారు. బాంబ్ బెదిరింపు నేపథ్యంలో షార్ వద్ద సీఐఎస్ఎఫ్ భద్రతను కట్టుదిట్టం చేశారు. షార్ ఉద్యోగులు, సిబ్బందిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతి ఇస్తున్నారు.