కూతురి మృతిపై కోర్టును ఆశ్రయించిన తండ్రి కేసులో నోటీసులు

కూతురి మృతిపై కోర్టును ఆశ్రయించిన తండ్రి కేసులో నోటీసులు

కరోనా వ్యాక్సిన్ కారణంగానే తన కుమార్తె కోల్పోయిందని ఆరోపిస్తూ.. రూ.1000 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ దిలీప్ లునావత్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. అందులో భాగంగా  సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా మహారాష్ట్రకు చెందిన దిలీప్ లునావత్ కుమార్తె స్నేహాల్ లునావత్ అనే వైద్య విద్యార్థిని నాసిక్ లో చదువుతుండేది. అయితే గతేడాది ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. కొన్ని రోజులకు ఆమె జ్వరం, వాంతులు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చించారు. వైద్య పరీక్ష అనంతరం స్నేహాల్ లునావత్ మెదడులో రక్తస్రావం అవుతున్నట్టు గమనించారు. అయితే ఆలా చికిత్స పొందుతున్న సమయంలో ఆమె ఆరోగ్యం విషమించి గతేడాది మార్చి 1 ప్రాణాలు విడిచింది.

ఈ క్రమంలో తన కుమార్తె చనిపోవడానికి కరోనా టీకానే అని ఆరోపిస్తూ.. ఆమె తండ్రి దిలీప్ లునావత్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం... ఆ వ్యాక్సిన్ ను తయారు చేసిన సంస్థతో పాటు కేంద్రానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి, డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది.