
ముంబై: బీజేపీ లీడర్, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రానాలకు ముంబై హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హనుమాన్ చాలీసా పఠనం కేసులో వారిద్దరు వేసిన పిటిషన్ వాయిదాలపై బాంబే హైకోర్టు హెచ్చరించింది. ఇది చివరి అవకాశం అని న్యాయస్థానం చెపుతూ వారి పిటిషన్ విచారణను జూలై 23కి వాయిదా వేసింది.
ఏ కేసులో ముంబైకోర్టు వార్నింగ్ ఇచ్చింది ?
2022లో చాలీజా వివాదం తర్వాత ముంబై పోలీసులు తమపై నమోదు చేసిన కేసు నుంచి డిశ్చార్జ్ చేచేయాలని కోరుతూ నవనీత్ కౌర్, రవి రానాలు దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ఎంఎస్ సోనాక్ విచారించారు. డిశ్చార్జీ పిటిషన్ ను సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో ఉత్తర్వులను సవాల్ చేస్తూ నవనీత్, ఆమె భర్త హైకోర్టును ఆశ్రయించారు. తమపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఎఫ్ ఐఆర్ ఆలస్యంగా నమోదు చేశారని, పోలీసుల దర్యాప్తు మొత్తం బూటకమని వారి పిటిషన్ లో తెలిపారు.
హనుమాన్ చాలీసీ కేసు ఏంటీ?
2022లో అప్పటి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే నివాసం ముందు బీజేపీ నేత నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతామని హెచ్చ రించి.. అనుకున్నట్లుగానే ఉద్ధవ్ థాకరే నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో ఓ పబ్లిక్ సర్వెంట్ ను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు నవనీత్ కౌర్, ఆమె భర్త రవిరానాపై కేసులు నమోదు చేశారు ముంబై పోలీసులు.ఈ కేసులో వారిద్దని అరెస్ట్ చేయడంతో నెల రోజులు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు అయింది.