మహా ప్రభుత్వానికి షాక్: కంగనాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే

మహా ప్రభుత్వానికి షాక్: కంగనాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే

బాలీవుడ్ నటి కంగానా రనౌత్ పోరాటానికి తగిన ఫలితం లభించింది. ముంబైలోని తన ఆఫీసును ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అక్రమంగా కూల్చివేసిందంటూ కంగనా ముంబై హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ(శుక్రవారం) ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

వివాదాస్పద వ్యాఖ్యలతో మహారాష్ట్రలో దూకుడు ప్రదర్శించి పలు  కేసులపాలైంది  కంగనా. అయితే ఆమెకు ముంబై హైకోర్టులో భారీ ఊరట లభించింది. బాలీవుడ్ హీరో  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది కంగనా. ఈ క్రమంలోనే ప్రతీకార చర్యగా ముంబై బాంద్రాలోని కంగనా ఆఫీసు అక్రమమంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(MBC) కూల్చివేసింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది కంగనా . చట్టప్రకారం నిర్మించిన బిల్డింగ్ ను చట్ట విరుద్ధంగా కూల్చివేశారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పిటీషనర్ కు జరిగిన నష్టాన్ని చెల్లించాలని ముంబై మున్సిపాలిటీని ఆదేశించింది.

బీఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ కంగనా చేసిన న్యాయ పోరాటం మొత్తానికి ఫలించింది. కూల్చివేతపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు సుధీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు శుక్రవారం తుది తీర్పును ఇచ్చింది. కంగనా కార్యాలయాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని తీర్పులో తెలిపింది.