మైనర్లను రేప్ చేసిన దొంగబాబాకు తగిన శాస్తే జరిగింది శిక్షను సమర్థించిన బాంబై హైకోర్టు

మైనర్లను రేప్ చేసిన దొంగబాబాకు తగిన శాస్తే జరిగింది శిక్షను సమర్థించిన బాంబై హైకోర్టు

మూడనమ్మకాలను ఆసరాగా చేసుకోని కొందమంది దుర్మార్గులు అమాయకులను ధన, మానాలను దోచేస్తున్నారు. 2004 నుంచి 2010 మధ్య కాలంలో బంగాలి బాబా ఆరుగురు మైనర్ బాలికలు, మరో ఏడుగురు యువతులు, ఓ పని మనిషిని మొత్తం 14మందిపై అత్యాచారం చేశాడు. బాధితుల్లో నలుగురు తల్లుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి బాబాను అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన స్పెషల్ కోర్టు నేరం రుజువు కావడంతో 2016 ఏప్రిల్ 7న బంగాలి బాబా(45)కు జీవత ఖైదు విధించింది. బాలికలకు మానసిక వైకల్యంతో పిల్లలు పుట్టకుండా ఉండాలని వారి తల్లులు ఓ బాబా దగ్గరికి తీసుకెళ్లారు. బంగాలి బాబా వారిపై లైంగిక దాడి చేశాడు. 

వారి వ్యాధిని నయం  చేస్తానని 1.30కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడు. ఈ విషయం కొన్ని రోజులకు వెలుగులోకి రాగా.. బాధితుల తల్లులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ తగాదాలతో ఈ నేరాన్ని తనపై మోపారిని, తన ఏ నేరం చేయలేదని కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ బాబా బాంబై హై కోర్టుకు వెళ్లాడు. ఈ రోజు బాంబై హై కోర్టు ఆ కేసుపై కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పను సమర్థిస్తున్నట్లు తెలిపింది. జీవిత ఖైదు శిక్ష అనుభవించాల్సిందే అని బాంబై కోర్టు చెప్పింది.