ప్రభాస్ హీరోగా మారుతి రూపొందించిన పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటించగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. జనవరి 9న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, రెండు సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా ‘నాచె నాచె’ అంటూ సాగే థర్డ్ సాంగ్‌ను ముంబైలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో నటుడు బొమన్ ఇరానీ మాట్లాడుతూ ‘ప్రభాస్ మూవీలో అవకాశం అనగానే కథ, క్యారెక్టర్ ఏంటని కూడా అడగకుండా ఒప్పుకున్నా.
ఆయనలోని చిన్న పిల్లాడి మనస్తత్వం అలాగే ఉంది. అది చాలా గ్రేట్’ అని అన్నారు. నటి జరీనా వాహబ్ మాట్లాడుతూ ‘ 40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కెరీర్ కొనసాగించాను. తెలుగులో ఎందుకు నటించరు అని చాలామంది అడిగేవారు. గతంలో మూడు నాలుగు చిత్రాల్లో నటించాను. కానీ రాజా సాబ్‌లో నటించడం మంచి గుర్తింపును తీసుకొస్తుందని భావిస్తున్నా. ప్రస్తుతం మూడు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నా’ అని చెప్పారు.
ప్రెస్టీజియస్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవడం సంతోషంగా ఉందని మాళవిక మోహనన్ చెప్పింది. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్‌తో నటించడం గౌరవంగా భావిస్తున్నామని నిధి అగర్వాల్, రిద్దికుమార్ అన్నారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ ‘మా సంస్థలో లార్జెస్ట్ మూవీ రాజా సాబ్‌ను, బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్ గారితో నిర్మించాం. ఆయన బాహుబలికి ముందు ఎలా కనిపించారో ఈ చిత్రంలో అలా కనిపిస్తారు. ఫన్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి’ అని అన్నారు.
