
- సింహవాహిని టెంపుల్‌కు డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఆషాఢ మాస బోనాల పండుగకు హైదరాబాద్ సిటీలోని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. బోనాల సందర్భంగా వివిధ ఆలయాల్లో సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ముఖ్యనేతలు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఏ ఆలయంలో ఎవరు పట్టువస్త్రాలు సమర్పిస్తారనే వివరాలను దేవాదాయశాఖ మంగళవారం వెల్లడించింది.
వచ్చే నెల 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించే బోనాల ఉత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 20న లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అధికారులు తెలిపారు.