తెలంగాణ-–ఛత్తీస్​గఢ్ ​బార్డర్‌లో బయటపడ్డ బూబీ ట్రాప్స్

తెలంగాణ-–ఛత్తీస్​గఢ్ ​బార్డర్‌లో బయటపడ్డ బూబీ ట్రాప్స్

భద్రాచలం,వెలుగు : తెలంగాణ-– ఛత్తీస్​గఢ్​సరిహద్దులో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబీ ట్రాప్స్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సోమవారం గుర్తించారు. ఎస్పీ రోహిత్ రాజ్​, భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పారితోష్​, ఓఎస్డీ సాయి మనోహర్​కథనం ప్రకారం...భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఛత్తీస్​గఢ్​సరిహద్దులో కొత్తగూడెం స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్​పీఎఫ్​,ఛత్తీస్​గఢ్​పోలీసులు సంయుక్తంగా ఏరియా డామినేషన్​ఆపరేషన్​నిర్వహించారు.

ఈ సందర్భంగా సుమారు 70 బూబీ ట్రాప్స్ గుర్తించారు. ఇందులో 4396 పదునైన ఇనుప చువ్వలు వెలికితీసి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల అడవుల్లో మందుపాతర పేలి ఆదివాసీ చనిపోగా, పోలీసులు అప్రమత్తమై వెంకటాపురం మండలం వీరభద్రవరం అడవుల్లో భారీ ఎత్తున మందుపాతరలను వెలికి తీసి నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలోనే ఏరియా డామినేషన్​ ఆపరేషన్ నిర్వహించారు.