హెల్త్ గ్యాడ్జెట్ ఈవా కోసం థర్డ్ ఫేజ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని స్టార్టప్ కంపెనీ బ్లూసెమీ ప్రకటించింది. ఈ ఒక్క డివైజ్‌తో బ్లడ్ గ్లూకోజ్, బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్, ఈసీజీ, ఆక్సిజన్ లెవెల్, యావరేజ్ గ్లూకోజ్ లెవెల్ వంటి ఆరు రకాల బాడీ వైటల్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
కేవలం 60 సెకన్లలో ఈ టెస్టులన్నీ పూర్తవుతాయని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. ధర రూ. 16,650. ఈ నెల 21–23 మధ్య బుకింగ్స్ ఓపెన్‌లో ఉంటాయి. అయితే ఇది మెడికల్ గ్రేడ్ డివైజ్ కాదని బ్లూసెమీ తెలిపింది.
