గిరిజన భాషల్లో పుస్తకాలొస్తున్నయ్

గిరిజన భాషల్లో పుస్తకాలొస్తున్నయ్
  • వీ హబ్ తో గిరిజన శాఖ ఒప్పందం

గిరిజన మహిళలను పారిశ్రామికవేత్తలుగా రూపొందించేందుకు వీ హబ్‌తో గిరిజన సంక్షేమ శాఖ ఒప్పందం చేసుకోవడం శుభపరిణామమని ఆ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. ఆదివాసీ దినోత్సవంగా సందర్భంగా హైదరాబాద్‌ సంక్షేమ భవన్‌లో పలు కార్యక్రమాలు నిర్వ హించారు. ఇందులో భాగంగా వీహబ్‌తో ఒప్పందం చేసుకున్నారు. గిరిజన బిడ్డలు మాతృభాష బదులు తెలుగులో చదువుకోవడంవల్ల కలుగుతున్న ఇబ్బందులను తొలగిం చడానికి గిరిజన భాషల్లో పుస్తకాలు తేవడం సంతోషకరమన్నారు. గిరిజనులకు ఉపాధి కల్పించేలా సీఎం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించారన్నారు.