కరోనా పెరిగితే మూడో డోసు తప్పదు

కరోనా పెరిగితే మూడో డోసు తప్పదు
  • బూస్టర్‌‌‌‌‌‌‌‌ డోస్‌‌‌‌‌‌‌‌ అవసరమే
  • కరోనా మ్యుటేషన్లు పెరిగితే తప్పనిసరి: ఎయిమ్స్ చీఫ్ గులేరియా
  • వ్యాక్సినేషన్, కరోనా రూల్స్ పాటిస్తే మూడో వేవ్ లేటవ్వొచ్చని వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా మ్యుటేషన్స్‌‌‌‌‌‌‌‌ పెరుగుతూ పోతే ఇండియన్లకు బూస్టర్‌‌‌‌‌‌‌‌ డోస్‌‌‌‌‌‌‌‌ అవసరమని ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ రణ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ గులేరియా చెప్పారు. రెండు డోసులు తీసుకున్న వాళ్లకు కూడా రోజులు గడిచే కొద్దీ ఇమ్యూనిటీ తగ్గుతుందని.. మున్ముందు వచ్చే వేరియంట్లను దృష్టిలో పెట్టుకుని బూస్టర్‌‌‌‌‌‌‌‌ డోస్ తీసుకోవాల్సిందేనని వివరించారు. ఈ బూస్టర్‌‌‌‌‌‌‌‌ డోస్‌‌‌‌‌‌‌‌లు రెండో తరానివని, మరింత ఇమ్యూనిటీని అందిస్తాయని చెప్పారు. ప్రజలందరికీ టీకాలేశాక ఈ డోస్‌‌‌‌‌‌‌‌ ఇస్తారన్నారు. దీనికి సంబంధించి ట్రయల్స్‌‌‌‌‌‌‌‌ మొదలయ్యాయని, ఈ ఏడాది చివరకల్లా అందుబాటులోకి రావొచ్చని వివరించారు. పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది చివరికి అందుబాటులోకి రావొచ్చన్నారు. జనవరిలో వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ మొదలయ్యాక ఇప్పటివరకు 6 శాతం మందికి దేశంలో టీకాలేశారని.. ఈ ఏడాది చివరికల్లా 60 శాతం మందికి వేస్తారా అని మీడియా ప్రశ్నించగా.. వచ్చే నెలలో వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ వేగం పెరుగుతుందని గులేరియా బదులిచ్చారు. వ్యాక్సిన్లతో కరోనా నుంచి కొంతవరకు రక్షణ ఉంటుందని.. ఇది అమెరికా, బ్రిటన్‌‌‌‌‌‌‌‌లో కనబడిందని చెప్పారు. కరోనా మ్యుటేషన్స్‌‌‌‌‌‌‌‌ పెరుగుతూనే ఉంటాయని కాబట్టి కరోనా రూల్స్ తప్పకుండా పాటించాల్సిందేనని సూచించారు. బ్రిటన్‌‌‌‌‌‌‌‌లో రూల్స్‌‌‌‌‌‌‌‌ను పక్కనపెట్టేయడంతో ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఆందోళన చెందుతున్నారని చెప్పారు. 

సీరో సర్వే ఫలితాలు ఆశాజనకం
దేశంలో 6 ఏళ్ల పైబడిన వాళ్లలో మూడింట రెండొంతుల మందిలో యాంటీబాడీస్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయని తాజా సీరో సర్వే వెల్లడించింది. దీన్ని బట్టి త్వరలోనే ఇండియా హెర్డ్‌‌‌‌‌‌‌‌ ఇమ్యూనిటీ స్థాయికి చేరుకుంటుందా అన్న ప్రశ్నకు.. హెర్డ్‌‌‌‌‌‌‌‌ ఇమ్యూనిటీ పదం వాడటం కరెక్టు కాదేమోనని గులేరియా అన్నారు. వైరస్‌‌‌‌‌‌‌‌లో మార్పులు లేకపోతే ఆ పదం వాడొచ్చని, కానీ మ్యుటేషన్స్‌‌‌‌‌‌‌‌ జరుగుతూ పోతే మున్ముందు చాలామంది వైరస్‌‌‌‌‌‌‌‌ బారినపడే అవకాశం ఉంటుందని అన్నారు. సీరో సర్వే ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నా రూల్స్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరిగా పాటించాలన్నారు. కరోనా రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటిస్తే, వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ వేగం పెరిగితే దేశంలో కరోనా మూడో వేవ్‌‌‌‌‌‌‌‌ లేట్‌‌‌‌‌‌‌‌ అవ్వొచ్చని.. తీవ్రత కూడా తక్కువగానే ఉండొచ్చని చెప్పారు. మూడో వేవ్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడొస్తుందో టైమ్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌పై క్లారిటీ లేదన్నారు. 

మోడెర్నా పిల్లల వ్యాక్సిన్‌‌‌‌కు ఈయూ గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌
పిల్లల కోసం మోడెర్నా డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసిన కరోనా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ స్పైక్‌‌‌‌‌‌‌‌ వాక్స్‌‌‌‌‌‌‌‌ను 12 నుంచి 17 ఏండ్ల వాళ్లకు వేసేందుకు యూరోపియన్‌‌‌‌‌‌‌‌ మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌ వాచ్‌‌‌‌‌‌‌‌డాగ్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం అనుమతిచ్చింది. 18 ఏండ్లు పైబడిన వారికి ఎలాగైతే వేస్తారో అలాగే ఇవ్వొచ్చని వెల్లడించింది. వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ను ఇంజెక్షన్‌‌‌‌‌‌‌‌ రూపంలో రెండు డోసులుగా ఇస్తారని, 4 వారాల తర్వాత రెండో డోసు వేస్తారని తెలిపింది. స్పైక్‌‌‌‌‌‌‌‌ వాక్స్‌‌‌‌‌‌‌‌ను 3,732 మందిపై ప్రయోగించి చూశారని, మంచి ఫలితాలు వచ్చాకే అనుమతి ఇచ్చామని చెప్పింది. ఈ ఏడాది మే నెలలో ఫైజర్ పిల్లల టీకాకు ఈయూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.