బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన మహిళా రైతు కర్ణకొండ శ్రావణికి ఉత్తమ రైతు పురస్కారం దక్కింది. వ్యవసాయంలో వినూత్న పద్ధతులు అవలంభిస్తూ అధిక దిగుబడులు సాధించినందుకు గాను సీఆర్ఐ పంప్స్ఉత్తమ రైతు పురస్కారాన్ని హైదరాబాద్లోని రాజీవ్నగర్యూనివర్సిటీలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతోపాటు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దస్జానయ్య చేతుల మీదుగా అందుకున్నారని తెలిపారు. శ్రావణి దంపతులను బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్స్రవంతి, శాస్త్రవేత్తలు అభినందించారు.
