మహిళపై లైంగిక వేధింపులు.. జవాన్ సస్పెండ్

మహిళపై లైంగిక వేధింపులు.. జవాన్ సస్పెండ్

మణిపూర్ లోని  ఓ కిరాణ షాపులో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు అధికారులు. అతనిపై కేసు నమోదు చేశారు.

కిరాణ స్టోర్ లోపల ఓ మహిళపై  జవాన్ అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  యూనిఫాంలో ఉన్న ఓ బీఎస్ఎఫ్ ఓ మహిళ మెడను పట్టుకుని వేధిస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది.  స్టోర్ లోపల సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్  కావడంతో అధికారులు రంగంలోకి దిగారు.

దీంతో దర్యాప్తు జరిపిన అధికారులు ఇంఫాల్‌లో జూలై 20న పెట్రోల్ పంపు దగ్గరలోని స్టోర్ లో ఈ ఘటన జరిగిందని తెలిపారు. నిందితుడు హెడ్ కానిస్టేబ్ సతీష్ ప్రసాద్ గా గుర్తించామన్నారు. అతడిని సస్పెండ్ చేసి  కేసు నమోదు చేశామని సీనియర్ అధికారి తెలిపారు.అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.