సీఎం సీపీఆర్వోగా బోరెడ్డి అయోధ్యరెడ్డి

సీఎం సీపీఆర్వోగా బోరెడ్డి అయోధ్యరెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ముఖ్యమంత్రి సీపీఆర్వో( చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) గా బోరెడ్డి అయోధ్య రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్​ శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఢిల్లీలో సీఎం పీఆర్వోగా దూడిపల్ల విజయ్​ కుమార్​ను నియమిస్తూ జీవో ఇచ్చారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలానికి చెందిన అయోధ్య రెడ్డి సుదీర్ఘకాలం ప్రింట్ మీడియాలో ప‌నిచేశారు.

ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కొంతకాలంగా జర్నలిజానికి దూరంగా ఉన్న ఆయ‌న‌, పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమితులైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. పీసీసీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఖమ్మంకు చెందిన దూడిపల్ల విజయ్​ కుమార్ ఓ పత్రికలో అసిస్టెంట్​ చీఫ్​ రిపోర్టర్​గా పనిచేస్తున్నారు.