విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన బ్రిట‌న్ ప్ర‌ధాని

విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన బ్రిట‌న్ ప్ర‌ధాని


బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ విశ్వాస పరీక్షల్లో నెగ్గారు. అనూహ్యంగా సొంత పార్టీ సభ్యుల నుంచే విశ్వాస తీర్మానం ఎదుర్కొన్న బోరిస్‌ జాన్సన్‌.. మంగళవారం (జూన్ 7న) జరిగిన ఓటింగ్‌లో విజయం సాధించారు. కొద్ది నెలల క్రితం బ్రిటన్‌లో కోవిడ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో డౌనింగ్ స్ట్రీట్‌లో జోరుగా పార్టీలు జ‌రిగాయి. బ్రిటన్‌లో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఆ పార్టీల‌కు ప్ర‌ధాని బోరిస్ హాజ‌రైన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో విప‌క్ష ఎంపీలు బోరిస్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌క‌టించాయి. దీనికి బోరిస్‌ సొంత పార్టీ నేతలు కూడా మద్దతు పలికారు.  

పార్టీ గేట్ వ్య‌వ‌హారంలో బోరిస్ జాన్స‌న్ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. మంగళవారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో భాగంగా బోరిస్‌కు మ‌ద్ద‌తుగా క‌న్జ‌ర్వేటివ్ పార్టీకి చెందిన 211 స‌భ్యులు ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తుగా 148 మంది స‌భ్యులు ఓటు వేశారు. దీంతో విశ్వాస తీర్మానంలో బోరిస్ నెగ్గారు. 59 శాతం మంది స‌భ్యులు త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం సంతోషంగా ఉంద‌ని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు. ఈ విజ‌యం త‌న‌కు శుభ ప‌రిణామం అని చెప్పారు. 2019లో బోరిస్ జాన్స‌న్ భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.