
గ్రేటర్ హైదరాబాద్ లో బోర్ల దందా జోరుగా సాగుతోంది. అడిగినంత ఇస్తే చాలు.. రూల్స్ గీల్స్ జాన్తానయ్.. మీకు ఇష్టం వచ్చిన చోట బోర్లు వేసుకోవచ్చు. స్థలం లేకున్నా.. పర్వాలేదు. పబ్లిక్ ప్లేసుల్లో వేసుకున్నా.. అడిగే వారే వుండరు. దర్జాగా రోడ్లపైనే వేసుకో.. అడ్డు చేప్పే వారే రారు. కానీ బ్రోకర్లకు, అధికారులకు కావాల్సినంత కాసులిస్తే సరిపోతుంది. ఇప్పుడు మహానగరంలో బోర్ల తవ్వకాల వెనక జరుగుతున్నది ఇది.