మొంథా తుఫానుతో అతలాకుతలం అయిన తెలంగాణపై వరుణ దేవుడు కరుణ చూపడం లేదు. కల్లాల్లో ఉన్న పంట తడిసీ పూర్తిగా పాడైపోయిన వైనం. చేలల్లో ఉన్న పత్తి నీరుగారిన పరిస్థితి. రైతులు తీవ్రంగా నష్టపోయి దేవుడా ఇక చాలు అని వేడుకున్నా.. వర్షాల తీవ్రత మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికే మంగళవారం (నవంబర్ 04) ఉదయం నుంచి వర్షాలు కురుస్తుండగా.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్:
మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా సాయంత్రం లోపు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట,వికారాబాద్ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు. గంటకు 40 నుండి 60 కి.మీ. మధ్య ఈదురు గాలులు విచే అవకాశం ఉందని తెలిపారు.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్:
హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి మహబూబాబాద్ మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయని అధికారులు తెలిపారు. అక్కడక్క మోస్తరు వ ర్షాలకు అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షంతో పాటు, గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.
►ALSO READ | కార్తీక పౌర్ణమి.. ఉసిరి దీపం ప్రాముఖ్యత ..విశిష్టత.. మొదట ఎవరు వెలిగించారో తెలుసా..!
