Weekend Movies : ఈ వీకెండ్ (Nov 7న) ఆడియన్స్కు పండుగే.. థియేటర్స్‌లో క్రైమ్, రొమాంటిక్, మైథికల్ థ్రిల్లర్స్

Weekend Movies : ఈ వీకెండ్ (Nov 7న) ఆడియన్స్కు పండుగే.. థియేటర్స్‌లో క్రైమ్, రొమాంటిక్, మైథికల్ థ్రిల్లర్స్

ఈ వీకెండ్ శుక్రవారం (2025 Nov 7న) థియేటర్స్‌లో అదిరిపోయే సినిమాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలు కాకపోయినా.. భారీ కంటెంట్ సినిమాలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే, ఈ సినిమాల నుంచి రిలీజైన విజువల్స్ ఆడియన్స్లో ఆసక్తి పెంచాయి. గత రెండు నెలలుగా ఒక్కో అప్డేట్ ఇస్తూ, ఆడియన్స్లో అంచనాలు పెంచుతూ వస్తున్నారు మేకర్స్.

కానీ, ఇందులో కొన్ని సినిమాలు సడెన్గా పోస్ట్ ఫోన్ అయి, ఆడియన్స్ ఆశలకు బ్రేకులు వేస్తూ వచ్చారు. ఇక ఈ వారం ఎలాంటి వాయిదాలు లేకుండా, ఖచ్చితమైన డేట్ ఫిక్స్ చేసుకుని రిలీజ్కు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలేంటీ? ఎలాంటి జోనర్లో తెరకెక్కాయి? అనేది వివరాలు చూసుకుందాం.    

1. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ (The Girlfriend):

నేషనల్ క్రష్ రష్మిక మందన్న అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ (The Girlfriend). రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. రష్మికకు జోడిగా దీక్షిత్ శెట్టి నటించాడు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ నవంబరు 7న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. మరోవారం తర్వాత తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే, సాంగ్స్, టీజర్, ట్రైలర్ విజువల్స్ ఆడియన్స్ లో అంచనాలు పెంచాయి. 

2.‘జటాధర’(JATADHARA):

సుధీర్ బాబు హీరోగా  సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రల్లో నటించిన సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు.

జీ స్టూడియోస్‌‌‌‌, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 7న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల కానుంది. బలమైన సాంకేతిక బృందం, భారీ తారాగణం, ధన పిశాచి అనే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. 

3.‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ (The Great Pre-Wedding Show)

మసుధ ఫేమ్' తిరువీర్ హీరోగా రాహుల్ శ్రీనివాస్‌‌‌‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’.  టీనా శ్రావ్య హీరోయిన్‌‌‌‌గా నటించింది. సందీప్ అగ‌‌‌‌రం, అష్మితా రెడ్డి నిర్మించారు. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా నవంబర్ 7న విడుదల కానుంది. వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ చుట్టూ ఓ ప్రేమ కథ, ఓ వింత సమస్య, దాన్నుంచి జనరేట్ అయ్యే కామెడీ సినిమాలో హైలెట్ గా నిలవనుంది. 

►ALSO READ | Rashmika Mandanna : ప్రభాస్‌తో రొమాన్స్ చేయాలని ఉంది.. మనసులో మాటను బయటపెట్టిన రష్మిక !

4. ‘ఆర్యన్‌’ (ARYAAN):

విష్ణు విశాల్ హీరోగా కె ప్రవీణ్ రూపొందించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ఎ పర్ఫెక్ట్ క్రైమ్ స్టోరీ అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్.  పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. ఇందులో పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విష్ణు విశాల్ కనిపించనున్నాడు. సైకో క్రిమినల్గా సెల్వరాఘవన్ నటిస్తున్నాడు. లాస్ట్ వీక్ అక్టోబర్ 31న విడుదల కావాల్సిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విడుదల చేయనున్నారు.