డ్రైవర్ నిర్లక్ష్యంతో ముగ్గురి బలి.. తాగకపోయినా ముగ్గురి మృతికి కారణమైన భారతీయ డ్రైవర్..

డ్రైవర్ నిర్లక్ష్యంతో ముగ్గురి బలి.. తాగకపోయినా ముగ్గురి మృతికి కారణమైన భారతీయ డ్రైవర్..

గత నెల కాలిఫోర్నియాలో ట్రక్కును ఢీకొట్టి ముగ్గురి మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపలేదని, కానీ పూర్తిగా నిర్లక్ష్యం వల్ల జరిగిందని అమెరికా అధికారులు స్పష్టం చేసారు.

యుబా సిటీకి చెందిన 21 ఏళ్ల జషన్‌ప్రీత్ సింగ్‌ను అక్టోబర్ 21న  మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడని  (DUI)  అనుమానంతో పోలీసులు అరెస్టు చేశారు.  కాలిఫోర్నియాలోని ఒంటారియోలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, చాల మంది తీవ్రంగా గాయపడ్డారు.

గత వారం  చేసిన ఫిర్యాదు ప్రకారం, టాక్సికాలజీ   రిపోర్టులో జషన్‌ప్రీత్  సింగ్‌కు పరీక్ష చేసిన సమయంలో అతని రక్తంలో ఎలాంటి  మద్యం/మాదకద్రవ్యాలు లేవని తేల్చి చెప్పింది. అయితే, ఈ ప్రమాదం పూర్తిగా నిర్లక్ష్యంతో జరిగిన హత్య అని శాన్ బెర్నార్డినో కౌంటీ జిల్లా అటార్నీ ఆఫీస్ తెలిపింది.

  ఫిర్యాదులో తీవ్ర నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదంకు సంబంధించిన మూడు కేసులు ఉన్నాయి. దీనితో పాటు, 'హైవేపై నిర్లక్ష్యంగా నడపడం వల్ల గాయపరిచారు' అనే కొత్త కేసు కూడా కలిపారు. ప్రత్యక్ష సాక్షులు, డాష్‌క్యామ్ వీడియోలో జషన్‌ప్రీత్  సింగ్ ఓవర్ స్పీడుతో ఆగి ఉన్న ట్రాఫిక్‌లోకి దూసుకెళ్లినట్లు తేలింది.

శాన్ బెర్నార్డినో కౌంటీ జిల్లా అటార్నీ జాసన్ ఆండర్సన్ మాట్లాడుతూ,  ఈ ప్రమాదం ముగ్గురు ప్రాణాలు తీసిన దారుణమైన విషాదం, చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. నిజం చెప్పాలంటే, నిందితుడు ఇంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయకుండా ఉంటే  దీనిని సులభంగా ఆపగలిగేవాళ్లం. రాష్ట్ర, కేంద్ర అధికారులు చట్టాలను సరిగ్గా అమలు చేసి ఉంటే, నిందితుడు కాలిఫోర్నియాలో ఉండేవాడు కాదు అని అన్నారు.

జషన్‌ప్రీత్  సింగ్‌ చేసిన నేరం తీవ్రత, పారిపోయే  అవకాశాలు ఉన్నాయని,  బెయిల్ ఇవ్వకూడదని అధికారులు వాదిస్తున్నారు జషన్‌ప్రీత్  సింగ్ ఒక అక్రమ వలసదారుడు. అతను 2022లో అమెరికా దక్షిణ సరిహద్దును దాటి వచ్చాడు. అలాగే అతనిపై విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది.

ఆగస్టు తర్వాత అమెరికాలో భారత సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్ వల్ల జరిగిన ఘోర రెండవ  ప్రమాదం. ఆగస్టు 12న, 28 ఏళ్ల హర్జిందర్ సింగ్ ఫ్లోరిడాలో  ట్రాక్టర్-ట్రైలర్‌తో రాంగ్ యు-టర్న్ తీసుకున్నాడు. దాని ఫలితంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. అతనిపై కూడా మూడు వాహన హత్య కేసులు ఉన్నాయి.

ఆగస్టు 12న 28 ఏళ్ల హర్జిందర్ సింగ్ ఫ్లోరిడాలో తన ట్రాక్టర్-ట్రైలర్‌తో రాంగ్  యు-టర్న్ తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి, దీని ఫలితంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. అతనిపై మూడు వాహన హత్య కేసులు ఉన్నాయి. ఈ సంఘటన తర్వాత, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వాణిజ్య ట్రక్ డ్రైవర్ వర్క్ వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.  అమెరికా రోడ్లపై పెద్ద ట్రాక్టర్-ట్రైలర్ ట్రక్కులను నడుపుతున్న విదేశీ డ్రైవర్లుపెరగడం అమెరికన్ జీవితాలను ప్రమాదంలో పడేస్తోంది అలాగే అమెరికన్ ట్రక్కర్ల జీవనోపాధిని దెబ్బతీస్తోంది అని రూబియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.