‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్

‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రంలో చిరుకి జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇప్పటికే టైటిల్ టీజర్ వదిలిన మేకర్స్, ఫస్ట్ సాంగ్ విడుదలకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల 23న సాయంత్రం 4.05 నిమిషాలకు ఈ పాటను విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఇవాళ రిలీజ్ చేశారు. 

"వెల్కమ్ టు ద బిగ్గెస్ట్ పార్టీ.. బాస్ పార్టీ" అంటూ ఈ హుషారైన ప్రోమో మొదలౌతుంది. అనంతరం,  దేవిశ్రీ ప్రసాద్.. "నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్ట్ ముడి వేసుకో, నువ్వు కర్చీఫ్ కట్టుకో.. బాస్ వస్తుండు, బాస్ వస్తుండు" అంటూ మాస్ లిరిక్స్ పలకడం ఈ ప్రోమోలో చూడొచ్చు. ఇక మేకర్స్ వదిలిన పోస్టర్ లో కలర్ ఫుల్ షర్ట్, మెడలో చైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లుంగీ పైకి కట్టి మాస్ స్టెప్పులు వేస్తున్న మెగాస్టార్ కనిపిస్తున్నాడు. 

ఈ పాట బిగ్గెస్ట్ పార్టీ సాంగ్ ఆఫ్ ఇయర్ గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సాంగ్లో చిరు సరసన ఊర్వశి రౌతెల్లా అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ సినిమాలో మాస్ మహరాజారవితేజ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.