టెన్త్ పరీక్షలకు సర్వం సిద్దం... ఆర్టీసీలో స్టూడెంట్స్ కు ఫ్రీ

టెన్త్ పరీక్షలకు సర్వం సిద్దం... ఆర్టీసీలో స్టూడెంట్స్ కు ఫ్రీ

ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని  ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్ క్లాసు స్టూడెంట్స్ కు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ కల్పిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఏపీలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు జరగనున్నాయి. 18 వరకు కొనసాగనున్నాయి.  టెన్త్‌ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 6.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లుగా బొత్స వెల్లడించారు. 

మొత్తం 6 సబ్జెక్ట్‌లకు పరీక్షలు నిర్వహించనున్నట్లుగా మంత్రి బొత్స తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష సమయం ఉంటుందని చెప్పారు. విద్యార్థులు సకాలంలో ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద నో మొబైల్ జోన్‌గా ప్రకటించాం. సెల్ ఫోన్, స్మార్ట్ పరికరాలు మొదలైనవి ఇన్విజలేటర్లు కూడా తీసుకురాకూడదని వెల్లడించారు. పరీక్షలు జరిగే రోజున పరీక్షా కేంద్రాల పరిధిలోని ఆయా పాఠశాలలకి సెలవు ఉంటుందన్నారు.