ధర్మపురి శ్రీనివాస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన బొత్స

ధర్మపురి శ్రీనివాస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన బొత్స

దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారయణ.  శ్రీనివాస్ తనకు చాలా అత్యంత సన్నిహితుడు, స్నేహితుడిగా భావించే వ్యక్తి అని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారని..  ఎంతో హుందాగా ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి అని చెప్పుకొచ్చారు.  

ఎప్పుడు  కూడా స్వార్థంగా ఆలోచించకుండా మంచి ఆలోచించే వ్యక్తి అని తెలిపారు బొత్స సత్యనారయణ.  తనలాంటి నేతలు ఇలాంటి స్థాయిలో ఉన్నారంటే అందుకు ఒకరకంగా ఆయనే కారణమన్నారు.  ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పనిచేసిన ధర్మపురి ఆలోచనలు,సూచనలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తుచేసుకున్నారు.  

ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా ఆయన ఎంతో కృషి  చేశారన్నారు.  వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు  బొత్స.