
నేరడిగొండ , వెలుగు: రైతులకు ఇబ్బందులు కలగకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పెన్ గంగా భవన్ లో శుక్రవారం ఆయన ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు . పిప్పల్ కోటి , దేగామ రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్యలపై ఆరా తీశారు.
నేరడిగొండ మండలంలోని తేజాపూర్ , బుగ్గారం , పిప్పిరి గ్రామ లిఫ్ట్ ఇరిగేషన్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు . నియోజకవర్గంలో కొనసాగుతున్న 11 చెక్ డ్యామ్ పనుల పురోగతిపై ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. బోథ్ నియోజకవర్గంలో అన్ని పనులను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లు , తదితరులు పాల్గొన్నారు.