ఈ సభకు మీరే పెద్ద అధ్యక్షా .. అలాంటి మీరు మోదీకి వంగి వంగి నమస్కరించారు : ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ

ఈ సభకు మీరే పెద్ద అధ్యక్షా .. అలాంటి మీరు మోదీకి వంగి వంగి నమస్కరించారు  : ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ

జూలై 1 2024. సోమవారం నాడు లోక్ సభ హోరా హోరీగా కొనసాగింది. సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ ప్రశ్నించారు. తాను మాట్లాడుతుంటే మైక్‌‌‌‌ కట్‌‌‌‌ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పీకర్‌‌‌‌ ఓంబిర్లా స్పందిస్తూ.. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు. స్పీకర్‌‌‌‌ వ్యవహారశైలిని కూడా రాహుల్ తప్పుబట్టారు. 

సభ ఫస్ట్ డే..  నేను షేక్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ ఇస్తే నిటారుగా నిల్చున్నారు.. ప్రధానమంత్రితో చేతులు కలిపినప్పుడు మరోలా కనిపించారు.. ప్రధాని మోదీ షేక్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ ఇచ్చినప్పుడు స్పీకర్‌‌‌‌ తలవంచారు. అని అనగా.. స్పీకర్ స్పందిస్తూ.. నా కంటే వయసులో మోదీ పెద్దవారైనందునే తలవంచాను. నేను సంప్రదాయాలను గౌరవిస్తాను అని స్పీకర్‌‌‌‌ వివరణ ఇచ్చారు.

దీనిపై  స్పందించిన రాహుల్.. మీరు చెప్పినదానిని నేను గౌరవిస్తాను కానీ ఈ సభలో స్పీకర్ కంటే పెద్దవారు ఎవరూ లేరని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇదే ప్రజాస్వామ్యం, ఈ సభకు మీరే నాయకుడు. ఎవరి ముందు తలవంచకూడదు. మనమందరం స్పీకర్ ముందు నమస్కరించాలి మరియు నేను మీ ముందు నమస్కరిస్తాను. దీంతో కొద్ది సేపు సభ రసాభసగా కొనసాగింది.