నెలన్నరగా నాగోల్ లో నరకప్రాయం

నెలన్నరగా నాగోల్ లో నరకప్రాయం
  •     నాగోల్‌‌ మమతానగర్‌‌‌‌లో నిలిచిన బాక్స్​ డ్రెయిన్​  పనులు
  •     గుంతలు తవ్వి వదిలేయడంతో ప్రమాదాల బారిన పడుతున్న స్థానికులు

ఎల్​బీనగర్, వెలుగు: ఎస్ఎన్‌‌డీపీ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా వృద్ధుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. నాగోల్ డివిజన్ బండ్లగూడ చెరువు నుంచి మూసీ వరకు మమతానగర్ మీదుగా బాక్స్ డ్రెయిన్​ వర్క్ పనులు నెలన్నరగా కొనసాగుతున్నాయి.  దీనికోసం రోడ్డును 20 ఫీట్ల లోతు తవ్వి వదిలేశారు.  అక్కడ అడ్డుగా బారికేడ్స్ లాంటి  రక్షణ చర్యలు ఏర్పాటు చేయలేదు.  దీంతో అటుగా వెళ్తున్న  స్థానిక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఆదివారం సాయత్రం శరణప్ప అనే వృద్ధుడు అందులో పడిపోగా గాయాలయ్యాయి.  కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.  గుంతలో గ్రానైట్ రాళ్లు, ఇనుప చువ్వలు ఉండగా వృద్ధుడికి తగలకపోవడంతో ప్రమాదం తప్పింది. గుంతను త్వరగా పూడ్చివేయాలని అధికారులను, కాంట్రాక్టర్‌‌‌‌ని కోరితే బయటకు రావొద్దని చెప్పారని, ఏదైనా ఉంటే ఆన్‌‌లైన్ లో బుక్ చేసుకోండని అంటూ మాట్లాడుతున్నారని స్థానికులు అంటున్నారు. జనం ఇబ్బంది పడుతున్నరు ఎస్ఎన్డీపీ పనులను మధ్యలో వదిలేసి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. ప్రజల ప్రాణాలను తీస్తారా ..? గుంతతో ఇబ్బందులు తట్టుకోలేక స్థానికులు కొందరు ఇండ్లకు తాళాలు వేసి వెళ్తున్నారు. 
– సామ రంగారెడ్డి, 
బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు