అయ్యో పాపం... శనగలు గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి

అయ్యో పాపం...  శనగలు గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి
  • కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండలం కనికి గ్రామంలో విషాదం

కాగజ్ నగర్, వెలుగు: శనగలు గొంతులో ఇరుక్కొని నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి..కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన జాడి కల్యాణి, ప్రకాశ్  దంపతులకు కొడుకు రిషి(4) ఉండగా, ప్రైవేట్  జాబ్  చేస్తూ మండలకేంద్రంలో కిరాయి ఇంట్లో ఉంటున్నారు. 

సోమవారం కౌటాల వారసంత కావడంతో సరుకులు, కూరగాయలు కొనేందుకు వెళ్లారు. అక్కడ వేయించిన శనగల ప్యాకెట్  చూసిన రిషి కొనివ్వాలని అడిగాడు. ఆ శనగలు గొంతులో ఇరుక్కోవడంతో రిషికి ఊపిరి ఆడలేదు. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని ప్రైవేట్  హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాలకు రెఫర్​ చేశారు. హాస్పిటల్​లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి రిషి చనిపోయాడు. మంగళవారం బాలుడి డెడ్​బాడీని సొంత గ్రామానికి తీసుకురాగా, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.