గర్ల్ ఫ్రెండ్‌ను కలవాలె.. ఏ స్టిక్కర్​ వాడాలె.. పోలీసులకు ఓ బాయ్ ​ఫ్రెండ్​ ట్వీట్

గర్ల్ ఫ్రెండ్‌ను కలవాలె.. ఏ స్టిక్కర్​ వాడాలె.. పోలీసులకు ఓ బాయ్ ​ఫ్రెండ్​ ట్వీట్
  • గర్ల్ ఫ్రెండ్‌ను కలవాలె.. ఏ స్టిక్కర్​ వాడాలె..
  • ముంబై పోలీసులకు ఓ బాయ్ ​ఫ్రెండ్​ ట్వీట్

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడంతో.. ఒకవైపు నైట్ కర్ఫ్యూ పెట్టి మరోవైపు ఉదయం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎమర్జెన్సీ వెహికల్స్ కు కలర్ కోడ్ స్టిక్కర్లు ఇచ్చి అనుమతిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పిలగాడు తన గర్ల్ ఫ్రెండ్​ను కలిసేందుకు పర్మిషన్ ఇవ్వాలని ముంబై పోలీసులకు ట్వీట్ చేశాడు. ‘‘నేను నా గర్ల్ ఫ్రెండ్ ను చాలా మిస్సవుతున్నా. తనను కలవాలని అనుకుంటున్నా. నేను బయటకు వెళ్లేందుకు నా బండికి ఏ స్టిక్కర్ వాడాలి?” అని అశ్విన్ వినోద్ ట్విట్టర్​లో ముంబై పోలీసులను అడిగాడు. దీనికి పోలీసులు.. ‘‘నీ ఎమర్జెన్సీ మాకు అర్థమైంది. కానీ అది మా సర్వీసెస్​ లిస్టులోకి అది రాదు బాబూ. అయినా,  దూరం పెరిగేకొద్దీ మనసులు  దగ్గరవుతాయి. మీరు జీవితాంతం కలిసి ఉండాలని మేం కోరుకుంటున్నాం. ప్రస్తుతం మీరు ఆరోగ్యంగా ఉన్నారు. ఇంటి దగ్గరే సేఫ్ గా ఉండండి. గుర్తుంచుకోండి..  ఈ దూరం టెంపరరీనే సుమా” అని బదులిచ్చారు. పోలీసుల రిప్లైకి నెటిజన్లు ఫిదా అయ్యారు. దీనికి వేలకొద్దీ లైకులు, రీట్వీట్లు వస్తున్నాయి.