ముషీరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగంతో బాగ్లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీ కామర్స్, ఎకనామిక్ విభాగం ఎంఓయూ కుదుర్చుకుంది. ఓయూ కామర్స్ హెచ్ఓడీ ప్రొఫెసర్ డి.చెన్నప్ప, ప్రొఫెసర్ వి.అప్పారావు, డీన్ ఫ్యాకల్టీ కామర్స్ ఎస్.కవితాదేవి, ప్రొఫెసర్ వి.నారాయణ అంబేద్కర్ విద్యాసంస్థల డైరెక్టర్, ప్రిన్సిపాల్స్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
ఇందులో భాగంగా అంబేద్కర్కాలేజీ స్టూడెంట్ల ఉన్నత విద్యకు తోడ్పాటు అందించడంతోపాటు, సెమినార్స్, వర్క్ షాప్, గెస్ట్ లెక్చర్స్, ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వనున్నారు. అలాగే అంబేద్కర్కాలేజీలో ‘ఆన్ హౌ టు ప్రిపేర్ ఎ ప్రాజెక్ట్’ అనే అంశంపై మంగళవారం సదస్సు కొనసాగింది. ఓయూ ప్రొఫెసర్లు విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చారు. పరిశోధన పద్ధతులు, ప్రాజెక్టు రూపకల్పన, సమాజంలో కామర్స్ ఆవశ్యకతను తెలియజేశారు.
