కరీంనగర్ టౌన్, వెలుగు: పెద్దపల్లి హోమియో సొసైటీ, కరీంనగర్ జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో హిమోఫిలియో వ్యాధిగ్రస్తులకు కరీంనగర్ సిటీలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌లుగా ఐఎంఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ రాంకిరణ్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శైలజ,సెక్రటరీ డాక్టర్ మహేశ్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిమోఫిలియో పేషెంట్లకు సంబంధించిన మెడిసిన్ గత 5 నెలలుగా ప్రభుత్వ హాస్పిటళ్లలో కొరత ఉందని, ఖర్చుతో కూడుకున్న మందుపై ప్రభుత్వం దృష్టి సారించి అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంవో రవీన, ఉదయ్, హిమోఫిలియో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, కృష్ణమూర్తి, పెద్దపల్లి సొసైటీ చాప్టర్ సభ్యులు వాసుదేవరావు, ప్రెసిడెంట్ మురళీకృష్ణ, రాంప్రసాద్, శ్రీనివాస్, మహేశ్, క్రాంతి, రమేశ్ పాల్గొన్నారు.
