ఇలా ఉంటే ఎంత సంపాదించినా.. పేదరికమే..! థాట్ ప్రాసెస్ కొంచెం చేంజ్ చేద్దాం బాస్..!

ఇలా ఉంటే ఎంత సంపాదించినా.. పేదరికమే..! థాట్ ప్రాసెస్ కొంచెం చేంజ్ చేద్దాం బాస్..!

మనం పేదవాళ్లలాగే ఉంటాం! ఎందుకంటే మన ఆలోచనలు, మన పనులు అలాగే ఉంటాయి. ఇక్కడ అసలు పేదరికం అంటే కూడు, గుడ్డ, గూడు లేకపోవడం కాదు. ఎప్పుడైతే మనం శాంతి, ప్రేమ, సంతోషం, గౌరవం లాంటి విలువల పట్ల పూర్ గా ఉంటామో.. అప్పుడు స్వార్థపరులుగా, అత్యాశపరులుగా మారిపోతాం. దీని వల్ల మన దగ్గర ఉన్నది ఇతరులతో షేర్ చేసుకో వడానికి బదులు... ఇతరుల నుంచి లాక్కోవ డం. డిమాండ్ చేయడం మొదలు పెడతాం. ఇది 'పూర్'గా మార్చేస్తుంది! ఎందుకంటే, కర్మ నియమం ఇలాగే ఉంటుంది. కర్మ విత్తనం మనం విత్తినప్పుడు దాని తాలూకు ప్రతిఫలం కచ్చితంగా పొందుతాం. 

అలా కాకుండా మామిడి విత్తనాల లాంటి మంచి కర్మలను చేపడితే.. మామిడి పండ్ల లాంటి పండ్లు ప్రతిఫలంగా దక్కుతాయి. మరి చెడు కర్మ అంటే ఏంటి? అది ఎలా మనల్ని 'పూర్'గా మారుస్తుంది? అంటే, మన దగ్గర అవసరానికి మించి ఉన్నా... ఇతరు లకు దాన్ని పంచలేకపోతే అదే నిజమైన పేదరికం!

పేదరికానికి సంబంధించిన వేరు ఎక్కడ ఉంటుంది? అంటే, మనం వేస్ట్ చేస్తున్న రిసోర్సెస్లో ఉంది. అన్నింటికంటే విలువైన రిసోర్సెస్.. మన ఆలోచనలు! మనలో ఎలాంటి ఆలోచనలు ఉంటే.. అలాంటి క్యారెక్టరే డెవలప్ అవుతుంది. క్యారెక్టర్ని మించిన విలువైన సంపద ఈ లోకంలో ఏముంది? మంచి ఆలోచనలే నిజమైన సంపద! అందుకే మంచి విషయాల మీద టైమిని, ఎనర్జీని, స్కిల్స్న ఇన్వెస్ట్ చేయాలి. స్వార్థం, అత్యాశ, అహంకారం, ఎటాచ్మెం ట్ లాంటి వాటిని మనసులో నుంచి తొల గించుకోగలిగితే.. ఈ పేదరికాన్ని ఈజీగా తుడిచిపెట్టొచ్చు!

– బ్రహ్మాకుమారీస్