ఆనందో బ్రహ్మా..తాత మనవళ్లుగా వచ్చేస్తున్న తండ్రీకొడుకులు

ఆనందో బ్రహ్మా..తాత మనవళ్లుగా వచ్చేస్తున్న తండ్రీకొడుకులు

బ్రహ్మానందం, ఆయన కొడుకు  రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. నిజజీవిత తండ్రీ కొడుకులు..ఇందులో  తాత, మనవళ్లుగా కనిపించబోతున్నారు. ఆర్వీఎస్ నిఖిల్ ఈ చిత్రానికి దర్శకుడు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.

‘బ్రహ్మా ఆనందం’ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి శుక్రవారం  బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో  సంప్రదాయ పంచె కట్టులో, చిరునవ్వుతో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఆగస్టు 19 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

Also Read:-సస్పెన్స్ థ్రిల్లర్ ‘పార్క్'..ఆసక్తిగా ట్రైలర్ రిలీజ్

ఈ  చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య  హోలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. శాండిల్య  పీసపాటి సంగీతం అందిస్తున్నాడు.