ఘనంగా బ్రహ్మానందం చిన్న కొడుకు నిశ్చితార్థం

ఘనంగా బ్రహ్మానందం చిన్న కొడుకు నిశ్చితార్థం

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థం మే 21 ఆదివారం డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె అయిన ఐశ్వర్య తో ఘనంగా జరిగింది.  ఐశ్వర్య కూడా డాక్టరే అవడం విశేషం. ఇక ఈ వేడుకకు కమెడియన్ ఆలీ, రఘుబాబు, టి. సుబ్బిరామిరెడ్డి తదితరులు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు.

 ప్రస్తుతం ఈ ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.ఇక బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు కాగా.. పెద్ద కొడుకు గౌతమ్ గురించి అందరికి తెలుసు. గౌతమ్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇక చిన్న కొడుకు సిద్దార్థ్ గురించి ఎవరికీ తెలియదు. అతను విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.