అపచారం కదూ : బ్రాహ్మణ పిల్లతో బలవంతంగా కోడిగుడ్డు తినిపించిన టీచర్

అపచారం కదూ : బ్రాహ్మణ పిల్లతో బలవంతంగా కోడిగుడ్డు తినిపించిన టీచర్

కోడి గుడ్డు శాఖాహారమా.. మాంసాహారమా అనేది పక్కన పెడితే.. రోజుకో గుడ్డు.. ఆరోగ్యానికి రక్ష అంటూ యాడ్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ స్కూల్స్ లోనూ పిల్లలకు గుడ్డు పెడుతోంది ప్రభుత్వం. గుడ్డు తినాలా లేదా అనేది ఆ పిల్లల ఇష్టం.. ఇందులో బలవంతం ఏమీ లేదు.. అయితే కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. విచారణ సైతం జరుగుతుంది.

శివమొగ్గలోని గర్టికెరె ప్రాంతంలో కమ్మచ్చి అనే గ్రామంలో ఉంది. అక్కడ కర్ణాటక పబ్లిక్ స్కూల్ నడుస్తుంది. ఈ స్కూల్ లో ప్రభుత్వం పిల్లలకు భోజనం పెడుతుంది. అందులో కోడిగుడ్లు ఉంటాయి. ఈ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓ ఏడేళ్ల పాప కూడా ఉంది. టీచర్ ఆ పాపతో గుడ్డు తినిపించాడు. కోడిగుడ్డు ఆరోగ్యానికి మంచిది.. బలం వస్తుంది అని చెప్పి తినిపించాడు. ఈ విషయాన్ని ఆ చిన్నారి ఇంటికెళ్లి తండ్రి శ్రీకాంత్ కు కంప్లయింట్ చేసింది. అతను కూడా గవర్నమెంట్ టీచర్ కావటం.. బ్రాహ్మణ ఆచారాలు పక్కగా పాటించే కుటుంబం కావటం.. వాళ్లింట్లో గుడ్డు తినకపోవటం వల్ల.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు చిన్నారి తండ్రి, టీచర్ అయిన శ్రీకాంత్.

తన కుమార్తెతో ప్రభుత్వ పాఠశాలలో బలవంతంగా కోడిగుడ్డు తినిపించారని.. దీని వల్ల నా కుమార్తె అనారోగ్యానికి గురైందని.. మానసిక వేదనకు గురవుతున్నట్లు విద్యాశాఖతోపాటు జిల్లా విద్యాశాఖాధికారికి కంప్లయింట్ చేశారు. కోడిగుడ్డు బదులు చిక్కీలు ఇవ్వాలని చెప్పినా వినకుండా ఇలా చేశారంటూ ఆ పాఠశాల టీచర్లపై కంప్లయింట్ చేశారు. దీనిపై విద్యాశాఖ విచారణ చేపట్టింది. ఈ కంప్లయింట్ గుడ్డు తినిపించిన టీచర్ సంజాయిషీ ఇచ్చాడు. వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని.. గుడ్డు మంచిది, బలం అన్న ఉద్దేశంతో ఇలా చేశానని.. ఇది ఇంత దూరం వస్తుందని ఊహించలేదని వెల్లడించాడు ఆ టీచర్. 

ఎలా చేసినా.. బలవంతంగా గుడ్డు తినిపించటం అనేది తప్పుగా భావిస్తూ.. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామంటోంది కర్ణాటక విద్యా శాఖ. మొత్తానికి బ్రాహ్మణ పిల్లకు కోడిగుడ్డు తినిపించటం అనేది ఇప్పుడు మనోభావాలకు సంబంధించిన ఇష్యూగా మారిపోయింది.