యూనివర్సిటీలో నిజాలుంటాయి :బ్రహ్మానందం

యూనివర్సిటీలో నిజాలుంటాయి :బ్రహ్మానందం

ఆర్ నారాయణ మూర్తి దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘యూనిర్సిటీ : పేపర్ లీక్’. ఆగస్టు 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌కు హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ ‘ఒకప్పుడు  విశ్వవిద్యాలయాలు అంటే కాశీ విద్యాలయం అని పెద్ద పేరు బెనారస్ యూనివర్సిటీ. ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి మనదేశం వచ్చి చదువుకొనివెళ్లిపోయేవారు. అంటే అంత జ్ఞాన సంపద ఉన్న దేశం మనది. ఈవాళ మన దేశం మన ఎడ్యుకేషనల్ స్థితి ఎలా వుంది విద్య వ్యవస్థలు ఎలా మారిపోతున్నాయి అని వాటి మీద రీసెర్చ్ చేసిన  నారాయణమూర్తి అవన్నీ తట్టుకోలేక ఈ చిత్రాన్ని రూపొందించారు. చాలాకాలం తర్వాత  నేను థియేటర్‌‌‌‌లో చూసిన  ప్రివ్యూ ఇది.  

ఇందులో అద్భుతమైన ఎమోషన్  ఉంది. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు చేస్తున్న  త్యాగాలను చూపించారు.  ఇందులో నిజాలుంటాయి.  బూతులు ఉండవు జీవితపు లోతులు ఉంటాయి’ అని చెప్పారు. నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘బ్రహ్మానందం గారు  మహానటుడు. మహా జ్ఞాని. అన్నింటిని మించి మాస్టరు. అందుకే నా పేపర్ లీకేజ్ సినిమా లోగోను ఆయనచే ఆవిష్కరింపచేసుకొని సినిమా రెడీ అయిన తరువాత ఆయనను కలిసి ఈ సినిమా చూసి నాలుగు మాటలు చెప్పాలని విజ్ఞప్తి చేశాను. ఇంత బిజీలో కూడా యూనివర్సిటీ సినిమా చూసి నన్ను ఆశీర్వదించి నాపై ప్రేమను చూపిస్తున్న బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని అన్నారు.