అమ్మాయంటే ఇలాగే ఉండాలి..దొంగల్ని ఉరికించి ఉరికించి కొట్టింది (వీడియో)

అమ్మాయంటే ఇలాగే ఉండాలి..దొంగల్ని ఉరికించి ఉరికించి కొట్టింది (వీడియో)

మానసికంగా అబ్బాయిల కంటే అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉంటారు.శారీరకంగా అబ్బాయిలకంటే అమ్మాయిలు వీక్ గా ఉంటారని అందరూ అంటుంటారు. కానీ అందులో వాస్తవం లేదని నిరూపించింది ఓ యువతి. తన పర్స్, డబ్బులు కొట్టేసిన ముగ్గురు దొంగలపై  దాడి చేసింది. రోడ్లపై ఉరికించి ఉరికించి కొట్టింది. ఆ యువతి స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

పంజాబ్‌లోని భటిండా జిల్లాలోని రాంపూరా ఫుల్ కు చెందిన పరిమీందర్ కౌర్ అనే యువతి కాలేజీలో ఫీజు కట్టేందుకు వెళుతుండగా ఓ గల్లీలో ముగ్గురు దొంగలు ఆమెను వెంబడించారు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో యువతి బ్యాగ్ ను లాక్కొని బైక్ పై వెళ్లేందుకు ప్రయత్నించారు. బ్యాగ్ లాక్కోవడంతో పడిన యువతి ఒక్క ఉదుటున దొంగ చేతిలో ఉన్నబ్యాగ్ ను లాగింది. అంతే యువతి బ్యాగ్ లాగడంతో బైక్ పై కూర్చున్న మూడో దొంగ కిందపడ్డాడ్డు. తప్పించుకుంటున్న మరో ఇద్దరు దొంగలు పారిపోతుంటే పట్టొకొని చితకొట్టింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు ముగ్గురు దొంగలకు దేహశుద్ది చేశారు. నంతరం నిందితుల్ని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా పరిమీందర్ కౌర్ మాట్లాడుతూ తాను 15వేలు కాలేజీ ఫీజ్ కట్టేందుకు వెళుతున్నట్లు, అదే సమయంలో దొంగలు తన కాలేజీ ఫీజ్, మొబైల్ ను దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది.