6 రోజుల ర్యాలీకి బ్రేక్.. సెన్సెక్స్ 693 పాయింట్లు డౌన్.. 213.65 పాయింట్లు తగ్గిన నిఫ్టీ

6 రోజుల ర్యాలీకి బ్రేక్.. సెన్సెక్స్ 693 పాయింట్లు డౌన్.. 213.65 పాయింట్లు తగ్గిన నిఫ్టీ

ముంబై: వరుసగా ఆరు రోజుల లాభాల తర్వాత స్టాక్ మార్కెట్లు శుక్రవారం దాదాపు ఒక శాతం పడిపోయాయి. యూఎస్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం కోసం ఎదురుచూపులు, గ్లోబల్ ట్రేడ్ అనిశ్చితుల కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.  హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, రిలయన్స్  షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.  30 షేర్ల బీఎస్​ఈ సెన్సెక్స్ 693.86 పాయింట్లు తగ్గి 81,306.85 వద్ద ముగిసింది. 50 షేర్ల ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 213.65 పాయింట్లు (0.85 శాతం) పడిపోయి 24,870.10 వద్ద సెటిలయింది. 

ఈవారంలో సెన్సెక్స్ 709.19 పాయింట్లు  (0.87 శాతం) లాభపడగా, నిఫ్టీ 238.8 పాయింట్లు  (0.96 శాతం) పెరిగింది.  యూఎస్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ జాక్సన్ హోల్ ప్రసంగానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారని,  ట్రంప్ సుంకాల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యంపై కొత్తగా ఆందోళనలు పెరిగాయని ఎనలిస్టులు తెలిపారు.  

ఇటీవలి లాభాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో ప్రాఫిట్​బుకింగ్ ​జరిగిందని పేర్కొన్నారు . సెన్సెక్స్‌‌ నుంచి నష్టపోయిన వాటిలో ఆసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఐటీసీ, హెచ్​సీఎల్ టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా ఉన్నాయి. లాభపడిన వాటిలో మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, భారత్ ఎలక్ట్రానిక్స్, సన్ ఫార్మా ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, గురువారం ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎఫ్​ఐఐలు) రూ. 1,246.51 కోట్లు విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

సెక్టోరల్​ సూచీలకు లాభాలు

బీఎస్​ఈ సెక్టోరల్​ సూచీలలో, మెటల్ 1.27 శాతం, కమోడిటీస్ (1.08 శాతం), బ్యాంకెక్స్ (1.06 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (0.84 శాతం), ఆయిల్ అండ్​ గ్యాస్ (0.80 శాతం), బీఎస్​ఈ ఫోకస్డ్ ఐటీ (0.77 శాతం)  ఐటి (0.77 శాతం) లాభపడ్డాయి. బీఎస్​ఈ స్మాల్‌‌క్యాప్ గేజ్ 0.35 శాతం, మిడ్‌‌క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం క్షీణించాయి.  గురువారం వరకు జరిగిన ఆరు రోజుల ర్యాలీలో, బీఎస్​ఈ బెంచ్‌‌మార్క్ 1,765 పాయింట్లు  (2.14 శాతం),  నిఫ్టీ 596 పాయింట్లు  (2.4 శాతం) ర్యాలీ చేసింది. 

ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్‌‌ఎస్‌‌ఇ కాంపోజిట్ ఇండెక్స్,  హాంకాంగ్‌‌కు చెందిన హాంగ్ సెంగ్ లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు మిడ్-సెషన్ ఒప్పందాలలో గ్రీన్‌‌లో ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.24 శాతం తగ్గి బ్యారెల్‌‌ ధర 67.52 డాలర్లకు చేరుకుంది.