
న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూ-చిప్ స్టాక్స్‌లో కొనుగోళ్లు, ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా కదలడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం లాభాల్లో కదిలాయి. మంగళవారం (May 22) నష్టాల నుంచి రికవర్ అయ్యాయి. సెన్సెక్స్ 410.19 పాయింట్లు లేదా 0.51 శాతం పెరిగి 81,596.63 వద్ద సెటిల్ అయింది.
సెన్సెక్స్‌లో 24 కంపెనీలు గ్రీన్‌లో ముగియగా, ఆరు నష్టపోయాయి. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 835.2 పాయింట్లు లేదా 1.02 శాతం పెరిగి 82,021.64 లెవెల్‌కి చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 129.55 పాయింట్లు లేదా 0.52 శాతం లాభపడి 24,813.45 వద్ద సెటిలయ్యింది. సెన్సెక్స్ కంపెనీల్లో, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, నెస్లే, టాటా మోటార్స్, హిందుస్తాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభాల్లో క్లోజయ్యాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐటీసీ నష్టపోయాయి. యూఎస్ టారిఫ్‌లు, గ్లోబల్ ట్రేడ్‌లో అంతరాయం ఉన్నా, ఇండియా ఎదుర్కోగలుగుతుందని మూడీస్ రేటింగ్స్ బుధవారం (May 22) ఇండియా గురించి ఒక నోట్‌లో పేర్కొంది.
మార్కెట్ పెరగడానికి ఇదొక కారణం. సెక్టోరల్ ఇండెక్స్‌లలో, క్యాపిటల్ గూడ్స్ (1.65 శాతం), రియల్టీ (1.58 శాతం), ఇండస్ట్రియల్స్ (1.35 శాతం), హెల్త్‌కేర్ (0.93 శాతం), టెక్ (0.81 శాతం) ఎక్కువగా పెరిగాయి. కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈలో 2,292 స్టాక్స్ లాభపడగా, 1,685 స్టాక్స్ నష్టపోయాయి.