ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

విద్యార్థులను ఢీకొట్టిన బొలెరోఇద్దరికి తీవ్రగాయాలు

కుభీరు,వెలుగు: కుభీరు మండలం పార్ది (బి) గవర్నమెంట్ స్కూల్ ఎదుట నిలుచున్న విద్యార్థులపై బొలెరో వెహికల్​దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. పార్దీ(బి) హైస్కూల్​లో ఎనిమిదో తరగతి చదువుతున్న శ్వేత, రక్షిత ఉదయం స్కూల్ గేటు ఎదుట నిలబడి ఉండగా భైంసా నుంచి వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొట్టింది. దీంతో ఇద్దరు పక్కనే ఉన్న కుంటలో పడిపోయారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో భైంసా ఏరియా హాస్పిటల్​కు తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడప డంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఇదే విషయమై ఎంఈఓ చంద్రకాంత్ వివరణ కోరగా యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవమేన్నారు.

కాంట్రాక్టర్ల జేబు నింపుతున్న టీఆర్ఎస్

దహెగాం,వెలుగు: టీఆర్ఎస్​ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కాంట్రాక్టర్ల జేబునింపుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.​ దహెగాం మండలం లగ్గాం పెద్దవాగు బ్రిడ్జి నుంచి కాగజ్​నగర్ మండలం అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జి వరకు శనివారం మహా పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దవాగు బ్రిడ్జి కుంగిపోయి ఏడాదిన్నర అయినా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కూలిపోయినా.. ప్రజలకు ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించడం కోసం చర్యలు తీసుకోవడంలేదన్నారు. దహెగాం, భీమిని మండల ప్రజలు నిత్యావసరాల కోసం పెంచికల్​పేట మీదుగా కాగజ్​నగర్​వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచికల్​పేట  బ్రిడ్జి నిర్మించి 17 ఏండ్లు అయినా అప్రోచ్​రోడ్డు వేయలేదన్నారు. అడ, జగన్నాథపూర్ ప్రాజెక్టులు కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే కట్టారని... వాటితో రైతులకు లాభం లేకుండా పోయిందన్నారు. పాదయాత్రకు సిర్పూర్​తాలూక బీజేపీ లీడర్ పాల్వాయి హరీశ్​బాబు సంఘీబావం తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు గోలెం వెంకటేశ్​, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, సింగిల్ విండో చైర్మన్ కొండ్ర  తిరుపతి గౌడ్, వైస్​చైర్మన్​రాపర్తి ధనుంజయ, మండల అధ్యక్షుడు రాంటెంకి సురేశ్, దోని శ్రీశైలం, భాస్కర్ లీడర్లు పుప్పాల సత్యనారాయణ, నాగేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి సంఘాల ఆగడాలను అరికట్టాలి

పోలీస్​ కమిషనర్​కు ట్రస్మా నాయకుల ఫిర్యాదు 

మంచిర్యాల, వెలుగు: జిల్లాలోని విద్యార్థి సంఘాల ఆగడాలను అరికట్టాలని ట్రస్మా కార్యవర్గ సభ్యులు శనివారం రామగుండం పోలీస్​ కమిషనర్​ చంద్రశేఖర్​రెడ్డికి ఫిర్యాదు చేశారు. కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరించడం, బ్లాక్​మెయిల్ చేయడం, స్కూళ్లు సజావుగా జరుగకుండా అడ్డుపడడం వంటి సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కొంతమంది 15 సంవత్సరాలుగా విద్యార్థి సంఘాల నాయకులుగా కొనసాగుతూ, మరికొందరు కులాల పేరిట సంఘాలు ఏర్పాటు చేసి వేధిస్తున్నారని తెలిపారు. సీపీ చంద్రశేఖర్​రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ఎవరైనా విద్యార్థి సంఘాల పేరిట ఇబ్బంది పెడితే పోలీసులకు కంప్లైంట్​ చేయాలని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారని టస్ర్మా నాయకులు పేర్కొన్నారు. సీపీని కలిసిన వారిలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్​రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కస్తూరి పద్మచరణ్, నాయకులు గోపతి సత్తయ్య, పెంచాల శ్రీధర్, జుల్ఫికర్ అహ్మద్, విక్రమ్​రావు, అహ్మద్​ఖాన్ ఉన్నారు.  

బాగాచదివి లక్ష్యం చేరుకోవాలి

ఆసిఫాబాద్,వెలుగు: విద్యార్థులు కష్టపడి చదివి లనుకున్న లక్ష్యం చేరుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. జన్కాపూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కోసం బీఈఎల్ కంపెనీ ప్రతినిధులు అందించిన 150 డ్యూయల్ డెస్క్ బెంచీలను శనివారం ఆయన అందజేశారు. అనంతరం కేజీబీవీ కాలేజీలో అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్​తో కలిసి ప్రొగ్రామ్​కోడింగ్​కిట్లను అందజేశారు. కార్యక్రమాలలో ఆర్ఐవో శ్రీధర్ సుమన్, బీఈఎల్ కంపెనీ ప్రతినిధులు శ్రీనివాస్, రవీందర్, ప్రొగ్రామ్​కోఆర్డినేటర్ సౌజన్య, ప్రత్యేక అధికారి నలంద, లెక్చరర్లు  తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే ఆదివాసీల అభివృద్ధి సాధ్యం

విద్యతోనే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ చెప్పారు. శనివారం రౌటసంకపెళ్లి లో నిర్వహించిన కుమ్రంభీం, ఎడ్ల కొండ జయంతి, వర్ధంతికి ఆయన హాజరయ్యారు. అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్​పేయ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి సంప్రదాయ పూజలు చేశారు. ఆదివాసీలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోండు భాషలో పాడిన పాట ఆకట్టుకుంది. కార్యక్రమంలో అడిషనల్ ఎస్సీ అచ్చేశ్వర్​రావు, జడ్పీటీసీ నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, వైస్ ఎంపీపీ మంగ పెంటయ్య, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్​అహ్మద్, సర్పంచ్ విమలకిష్టయ్య, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య, ఎంపీటీసీ సుశీల, ఐటీడీఏ డైరెక్టర్ లక్ష్మణ్, ఆదివాసీ లీడర్లు ఆత్రం భీంరావు, కిష్టయ్య, పర్చకి కేశవ్ తదితరులు పాల్గొన్నారు.

కరెంట్ మీటర్ల జారీకి ఎన్ వోసీలు ఇవ్వాలి

బెల్లంపల్లి,వెలుగు: కరెంట్​మీటర్ల కోసం ఆరు నెలలుగా మున్సిపల్​సిబ్బంది ఎన్​వోసీ ఇవ్వడంలేదని.. దీంతో వేలాది మంది విద్యుత్ కనెక్షన్ల కోసం ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్​కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్ యాదవ్ ఆరోపించారు. శనివారం జరిగిన మున్సిపల్​మీటింగ్​లో ఆయన చైర్ పర్సన్ జక్కుల శ్వేత, ఇన్​చార్జి కమిషనర్ ఆకుల వెంకటేశ్ ను నిలదీశారు. ఇదే విషయమై 5వ వార్డు కౌన్సిలర్ బొడ్డు విజయ తిరుమల నేలపై కూర్చొని నిరసన వ్యక్తంచేశారు. స్పందించిన చైర్ పర్సన్, ఇన్​చార్జి కమిషనర్​సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో పట్టణంలో గాంధీ విగ్రహం నుంచి కొత్త బస్టాండ్ వరకు ఖరాబైనా సెంట్రల్​లైటింగ్ కేబుల్ ఏర్పాటు చేసేందుకు తీర్మానించారు. సమావేశంలో వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, పలు డిపార్ట్ మెంట్ల ఆఫీసర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

పవర్​మేక్ ​కంపెనీ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి

జైపూర్,వెలుగు: జైపూర్ లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పవర్ మేక్ కంపనీ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని మహిళా కార్మికులు డిమాండ్​చేశారు. శనివారం వారు ప్లాంట్​గేట్​ఎదుట మాట్లాడారు. డబ్బులు తీసుకొని ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఏడేళ్లుగా కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికురాలిగా పనిచేస్తున్న మహిళను కంపెనీ హెచ్ఆర్ మధు, అనిల్ కపూర్ ఇబ్బంద్దులకు గురిచేస్తూ విధులకు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషించి దిక్కున్న చోట చెప్పుకోవాలని తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎస్టీపీపీ పర్సనల్ మేనేజర్ ను వివరణ కోరగా కొద్ది రోజుల క్రితం పవర్ మేక్ కంపనీ హెచ్ఆర్ విభాగంలో సెల్ ఫోన్ల దొంగతనం జరిగిందని, సీఐఎస్ఎఫ్ సిబ్బందితో ఎంక్వైరీ చేయించినట్లు తెలిపారు. అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కాంట్రాక్ట్​లేబర్​ను వేరేచోటికి మార్చినట్లు వివరించారు.

ట్రిపుల్​ ఐటీలోకి చొరబడ్డ యువకుడి అరెస్టు

భైంసా(బాసర), వెలుగు: బాసర ట్రిపుల్​ఐటీలోకి అక్రమంగా చొరబడిన ఖమ్మం జిల్లా జక్కపల్లికి చెందిన పల్లె రఘువంశీ ని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే రఘువంశీ క్యాంపస్ గోడకు ఉన్న కన్నం నుంచి లోపలికి వెళ్లాడు. తన బంధువు (ఫ్యాకల్టీ)ని కలిసిన తర్వాత సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడ్డాడు. దీనిపై సక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై మహేశ్​ తెలిపారు.

గిరిజన గ్రామాల్లో గుస్సాడీల సందడి

బజార్ హత్నూర్,వెలుగు: మండల కేంద్రంలోని కొత్తగూడ గ్రామానికి శనివారం మహారాష్ట్రలోని సింగర్ వాడి గ్రామం నుంచి దండారీలు వచ్చారు. బృందానికి గ్రామస్తులు డోలు వాయిస్తూ ఎదురెల్లి ఘన స్వాగతం పలికారు. అనంతరం అతిథి మర్యాదలు చేశారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ జుగదిరావు, దెవరి పేందుర్ మహేశ్, నైతం వినాయక్, పెందూర్ చందు, పెందూర్ మారుతి, పెందూర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

భీం చరిత్ర ప్రపంచ వ్యాప్తం చేస్తాం

నిర్మల్,వెలుగు: ఆదివాసీ ఆరాధ్యదైవం కుమ్రంభీం చరిత్రను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. శనివారం కుమ్రంభీం జయంతి సందర్భంగా స్థానిక చైన్ గేట్ వద్ద గల ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళి అర్పించారు. జోడేఘాట్​ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యటు చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భీం జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ భీంను స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేశారన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై భీం విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని చాటేందుకు రూ. 55 కోట్లతో ఆదివాసీ భవన నిర్మాణం చేపట్టామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, దేవరకోట దేవస్థానం చైర్మన్ లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు మేడారం ప్రదీప్, లక్కాకుల నరహరి, పూదరి రాజేశ్వర్, ఆదముల పద్మాకర్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు చారి, ఆదివాసీ సంఘాల లీడర్లు మొసలి చిన్నయ్య తదితరులు 
పాల్గొన్నారు.

చదువుతోనే గుర్తింపు

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: చదువుతోనే విద్యార్థులకు గుర్తింపు వస్తుందని.. ప్రతీ ఒక్కరు ప్రణాళికబద్ధంగా విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ సూచించారు. శనివారం స్థానిక రణదివ్యనగర్ జడ్పీ హైస్కూల్​విద్యార్థులకు దాతలు అందజేసిన ఐడీ కార్డులు, బెల్టులు, ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను కలెక్టర్ అందజేశారు. మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, ఎంఈవో జయశీల, కౌన్సిలర్ కోవ రవి, వసుధ ఫౌండేషన్  ప్రతినిధులు గోవర్దన్​రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఆయా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, హెచ్ఎం భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్యవర్గం ఎన్నిక

ఖానాపూర్,వెలుగు: కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఖానాపూర్ శాఖ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా అప్సర్​హుస్సేన్, ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ షాహిద్, ప్రధాన కార్యదర్శిగా చాంద్, సంయుక్త కార్యదర్శిగా అదనాన్ సైఫ్, ట్రెజరర్​గా షేరు ఖాన్ ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గం రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతుందని సొసైటీ నిర్మల్ జిల్లా సహాయ కార్యదర్శి సయ్యద్ చాంద్  తెలిపారు.

  • విద్యార్థులను ఢీకొట్టిన బొలెరో
  • ఇద్దరికి తీవ్రగాయాలు

కుభీరు,వెలుగు: కుభీరు మండలం పార్ది (బి) గవర్నమెంట్ స్కూల్ ఎదుట నిలుచున్న విద్యార్థులపై బొలెరో వెహికల్​దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. పార్దీ(బి) హైస్కూల్​లో ఎనిమిదో తరగతి చదువుతున్న శ్వేత, రక్షిత ఉదయం స్కూల్ గేటు ఎదుట నిలబడి ఉండగా భైంసా నుంచి వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొట్టింది. దీంతో ఇద్దరు పక్కనే ఉన్న కుంటలో పడిపోయారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో భైంసా ఏరియా హాస్పిటల్​కు తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడప డంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఇదే విషయమై ఎంఈఓ చంద్రకాంత్ వివరణ కోరగా యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవమేన్నారు.

శిబిరాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ సురేశ్ కుమార్ 
రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి

కాగజ్ నగర్, వెలుగు: రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని ఎస్పీ సురేశ్​కుమార్​చెప్పారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం కాగజ్ నగర్ టౌన్, కౌటాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత రక్తం ఇవ్వడానికి ముందుకు రావడం మంచివిషయమన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​తో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా తహసీల్దర్​మునావర్​షరీఫ్​రక్తదానం చేశారు. కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, సీఐలు బుద్దే స్వామి, రవీందర్, నాగరాజు, ఎస్సైలు ప్రవీణ్​కుమార్​ప్రవీణ్ కుమార్, వెంకటేశ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.