నా కొడుకు కోహ్లీలా ఎదగాలని కోరుకుంటా.. క్రికెట్‌కు అతనే ఆదర్శం: వెస్టిండీస్ దిగ్గజం

నా కొడుకు కోహ్లీలా ఎదగాలని కోరుకుంటా.. క్రికెట్‌కు అతనే ఆదర్శం: వెస్టిండీస్ దిగ్గజం

క్రికెట్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. బ్యాట్ తో విరాట్ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కోహ్లీతో లో మరో స్పెషాలిటీ అతని ఫిట్ నెస్. ప్రపంచ  క్రికెటర్లలో విరాట్ ఫిట్ నెస్ విషయంలో టాప్ లో ఉంటాడనంలో ఎలాంటి సందేహం లేదు. మైదానంలో మొదటి ఓవర్ నుంచి చివరి ఓవర్ దాకా ఈ రన్ మిషన్ ఎనర్జీ కొంచెం కూడా తగ్గదు. ఎప్పుడూ జట్టును గెలిపించాలనే కసి కోహ్లీలో ఉంటుంది. ఈ లక్షణాలే దిగ్గజాలను సైతం ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విండీస్ ఆల్ టైం గ్రేట్ బ్యాటర్ బ్రియాన్ లారా.. కోహ్లీని ఆకాశానికెత్తేసాడు.    

 కోల్‌కతాలోని భవానీపూర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజీలో లారా మాట్లాడుతూ 'నాకు ఒక కొడుకు ఉన్నాడు. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఒకవేళ నా కొడుకు ఏదైనా క్రీడ ఆడవలసి వస్తే నేను కోహ్లీ యొక్క నిబద్ధత, అంకితభావాన్ని నింపుతాను. అంతేకాకుండా నంబర్ 1 క్రీడాకారుడు ఎలా కావాలో కోహ్లీని ఉదాహరణగా చూపిస్తా. కోహ్లీ మానసికంగా ఎంత బలంగా ఉంటాడనే విషయాన్ని నా కొడుకుకు వివరిస్తాను'. అని ఈ విండీస్ దిగ్గజం తెలియజేశాడు.
 
కోహ్లీ వరల్డ్ కప్ ఫామ్ ను ఉద్దేశిస్తూ 'భారత్ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడానికి కోహ్లీ కారణం కాదని తెలియజేశాడు. కోహ్లీ వ్యక్తిగతంగా అద్భుతంగా ఆడాడు. గెలవడానికి జట్టు సమిష్టి కృషి అవసరం. కోహ్లీ చేయగలిగినదంతా చేసాడు. టోర్నీ మొత్తం అసాధారణ ఆటతీరును ప్రదర్శించి దిగ్గజాల సరసన నిలిచాడు'. అని లారా చెప్పుకొచ్చాడు. కాగా.. కోహ్లీ ఇటీవలే స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ లో 765 రన్స్ తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.